దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన కస్టమర్లకు
అభయమిచ్చింది. టెలికం రంగం చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బంపర్ ఆఫర్స్
ప్రకటించింది జియో. కస్టమర్లకు మూడునెలల పాటు ఉచిత వాయిస్, డాటా, ఎస్ ఎమ్
ఎస్ లను ప్రకటించిన సంగతి తెలిసిందే. హ్యాపి న్యూ ఇయర్ పేరుతో మరో మూడు
నెలలు ఉచిత సేవలు అందిస్తున్నట్టు డిసెంబర్ మొదటి వారంలో వెల్లడించారు
ముఖేష్ అంబానీ. దీనిపై ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ కంపెనీలు మండిపడ్డాయి.
జియో దెబ్బకు కొన్ని కంపెనీలు మూత పడ్డాయి.
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో మరో 90 రోజులు పొడిగించిన ఆఫర్ పై ట్రాయ్ లో ఫిర్యాదు చేశాయి రైవల్ కంపెనీలు. ఈ ఆఫర్ పొడిగింపు నిబంధనల ఉల్లంఘన కిందకు ఎందుకు రాదో వివరణ ఇవ్వాలని రిలయన్స్‌ను కోరింది టెలికం రెగ్యులేటరీ అథారిటీ(TRAI).
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పై వివరణ ఇచ్చింది జియో. తాము ప్రకటించిన రెండు ఫ్రీ ప్యాకేజీలు వేర్వేరని తెలిపింది. వెల్ కం ఆఫర్ ముగిసినా..దానికి రీచార్జ్ చేసుకునే అవకాశం లేదని ప్రకటించింది. హ్యాపి న్యూ ఇయర్ ఆఫర్ లో ఈ అవకాశం ఉందన్నారు. కస్టమర్లు కొనసాగాలనుకుంటే.. మళ్లీ రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. ట్రాయ్ నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చింది జియో.

No comments:
Post a Comment