కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు హిందూ సంప్రదాయం ప్రకారం ఫ్రాన్స్
యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. జిల్లాలోని వీణవంక మండలం బేతిగల్
గ్రామానికి చెందిన పరశురాములు, వీరలక్ష్మీ దంపతుల కుమారుడు చిరంజీవి పెద్ద
చదువుల కోసం మూడేళ్ల క్రితం పారిస్ వెళ్లాడు. నగరంలోని ఓ యూనివర్సిటీలో
పీహెచ్ డీ చేస్తున్న చిరంజీవికి అదే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేస్తున్న
సఖినా గ్రిల్స్ అనే యువతితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇరువురు తమ విషయాన్ని కుటుంబ పెద్దలకు
చెప్పారు. పిల్లల ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో శుక్రవారం మధ్యాహ్నం
జమ్మికుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం ఇరువురి వివాహం
జరిగింది. ఈ వేడుకకు వరుడి తరఫు బంధువులతో పాటు వధువు తరఫు వారు కూడా పెద్ద
ఎత్తున హాజరయ్యారు.
No comments:
Post a Comment