రుద్రమదేవి స్పూర్తిగా మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచారు వరంగల్
పోలీసులు. ఒకేసారి ఒకే వేదిక నుంచి 21 వేల మంది మహిళలకు మార్షల్ ఆర్ట్స్ లో
ట్రైనింగ్ ఇచ్చి గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ ఫర్
ఉమెన్ పేరుతో నిర్వహించిన ఈ మోగా ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండయ్యారు
డీజీపీ అనురాగ్ శర్మ.
సిటీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం పబ్లిక్ తో కిక్కిరిసిపోయింది. 21762 మంది మహిళలు, యువతులు 51 నిమిషాల 32 సెకండ్లపాటు మార్షల్ ఆర్ట్స్ సాధన చేశారు. ట్రైనర్స్ గైడ్ లైన్స్ తో అంతా ఒకే వేదిక నుంచి మహిళాశక్తిని చాటారు. డీపీజీ అనురాగ్ శర్మ, సీపీ సుదీర్ బాబు, కలెక్టర్లు అమ్రపాలి, ప్రశాంతిపాటిల్, దేవసేన, ఎస్పీలతో పాటు గిన్నీస్ బుక్ పరిశీలకులు ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఇలాంటి ఈవెంట్ ను గతంలో బ్రెజిల్ లో నిర్వహించారు. 2 వేల 272 మందితో అక్కడ ఈ తరహా కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ పోలీసులు కూడా 3 వేల మందితో శిక్షణ నిర్వహించి… రికార్డు బ్రేక్ చేయాలని భావించారు. ఎన్ రోల్ మెంట్ కు పిలుపునివ్వడంతో ఏకంగా 27 వేల మంది రెస్పాండ్ అయ్యారు. ఈవెంట్ లో 21 వేల 762 మంది పార్టీసీపేట్ చేశారు. గిన్నీస్ బుక్ లో చోటు దక్కేలా ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసిన సీపీ సుదీర్ బాబును అభినందించారు డీజీపీ. మహిళలు తక్కువనే భావన పోవాలన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. సమస్య ఏదైన ధైర్యంగా ఎదుర్కొవాలని సూచించారు. షీటీమ్ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని చెప్పారు. వరంగల్ వేదికగా మహిళా శక్తిని ప్రపంచానికి చాటామన్నారు కలెక్టర్ అమ్రపాలి. గత రికార్డులన్నింటిని వరంగల్ ఈవెంట్ బ్రేక్ చేసిందన్నారు గిన్నీస్ రికార్డు పరిశీలకులు జయసింహా.
మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తమలో ధైర్యాన్ని నింపిందన్నారు ఈవెంట్ లో పాల్గొన్న యువతులు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలమన్న నమ్మకం కలిగిందన్నారు. షీటీమ్ తోడుగా ఆకతాయిల ఆటకట్టిస్తామన్నారు.వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ లో భాగసామ్యులైనందుకు హ్యాపీగా ఉందన్నారు. రుద్రమదేవి స్పూర్తిగా మహిళాశక్తిని ప్రపంచానికి చాటారని వరంగల్ యవతను అభినందించారు డీజీపీ.

No comments:
Post a Comment