ఈ రోజుల్లో అందరూ పర్సుని వాడటం అనేది
కామన్. చిన్న పర్సు నుంచి పెద్ద హ్యాండ్ బ్యాగ్ వరకు వాడే వాళ్ళ అందరికి
ఉండే అలవాటు ఏమిటంటే… చేతికి ఏది దొరికినా అందులో పెట్టేయడమే. కొన్ని
పెట్టడం మంచిదే కాని కొన్ని పెడితే అస్సలు మంచిది కాదు. ఎంత సంపాదించినా
డబ్బు ఖర్చు అయిపోవడం లేదా అనుకున్న అమౌంట్ రాక ఇబ్బంది పడటం జరుగుతుంది.
ఇంతకీ ఆ పెట్టకూడని వస్తువులు ఏమిటో చూద్దాం…
- పర్సులో అనవసరమైన పాత పేపర్లు, ఏటీఎం రిసీప్ట్స్, చాక్లెట్ పేపర్లు, షాప్ బిలల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పర్సును అస్తవ్యస్తంగా పెట్టడం వలన, మన ఆర్ధిక పరిస్థితి కూడా ఇలాగే అస్తవ్యస్తంగా ఉంటుంది.
- నెగటివ్ ఎనెర్జీ ఇచ్చే ఫోటోలు ఉదాహరణకి అసభ్య ఫోటోలు, దయ్యం పొటోలు, హింస, యుద్ధం ఇలాంటివి ఏవీ పెట్టకూడదు.
- చిరిగిన పర్సు వాడటం వలన నెగటివ్ ఎనేర్జీ వచ్చి డబ్బు ని నష్టపోతాము.
లక్ష్మి ఫోటో, శ్రీ యంత్రం, రావి చెట్టు ఆకు, వెండి ఇలాంటివి పెట్టుకోవడం వలన ధనం, అదృష్టం, కుటుంబ సౌక్యం అన్నీ కలుగుతాయి
No comments:
Post a Comment