ఫ్లోరిడా:
కంప్యూటర్ల హ్యాకింగ్ వ్యవహారంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను భావి
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. రష్యా, అమెరికాలను ఈ వివాదం
నుంచి దూరంగా ఉంచాలన్నారు. మనం దీనిని ఇంతటితో వదిలి ముందుకెళ్లాలని ఆయన
సూచించారు. అసలు రష్యా హ్యాకర్లు డెమొక్రటిక్ పార్టీ కంప్యూటర్లు, వ్యక్తుల
నుంచి సమాచారం సేకరించి తనకు మద్దతుగా ఆన్‌లైన్‌లో పోస్టు చేశాయన్న
ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలపై ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. రష్యాపై
అమెరికా అంక్షలు విధించాలని ప్రయత్నిస్తోందన్న వార్తలపై ఆయన్ను ప్రశ్నించగా
ఈ విధంగా స్పందించారు. అసలు మన జీవితాల్ని కంప్యూటర్లు జటిలం చేశాయని
ట్రంప్ అన్నారు. ఒక కంప్యూటర్ జీవితకాలంలో ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరన్నారు.
ట్రంప్ ప్రస్తుతం క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నిమిత్తం ఫ్లొరిడాలోని మార్ ఎ లాగో రిసార్ట్‌లో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన తన కార్యనిర్వాహక బృందం ఎంపికల కోసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారు.
ట్రంప్ ప్రస్తుతం క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నిమిత్తం ఫ్లొరిడాలోని మార్ ఎ లాగో రిసార్ట్‌లో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన తన కార్యనిర్వాహక బృందం ఎంపికల కోసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారు.
No comments:
Post a Comment