ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో జరిగిన డిజిధన్ కార్యక్రమంలో బీమ్ యాప్ ను ప్రారంభిస్తూ వచ్చే ఏడాది నుంచి ప్రతి ఒక్కరూ రోజుకు 5 డిజిటల్ లావాదేవీలు జరిపితే చాలు దేశం డిజిటల్ మయం మవుతుందన్నారు. దేశంలోని 600 మిలియన్ల మంది భీమ్ యాప్ కు అలవాటు పడతారన్నారు. నగదు, అవినీతి రహిత దేశంగా ఇండియా మారిపోతుందన్నారు. రెండు ఫోన్లు పెట్టుకొని డిజిటల్ పేమెంట్ చేయడం లేదా అని అందరూ అడిగే పరిస్థితి తెచ్చుకోవదన్నారు ప్రధాని.
మూడేళ్ల క్రితం దేశం ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. బంగారు పాత్రల్లో తినే దేశాన్ని పేదరికంలోకి నెట్టేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని తెలిపారు మోడీ. జనవరి 1 నుంచి చూడండి దేశం మొత్తం భీమ్ యాప్ ద్వారానే డిజిటల్ లావాదేవీలు జరగుతాయన్నారు. కొద్ధి రోజుల్లోనే దేశం మొత్తం డిజిటల్ మయం అయిపోతుందన్నారు. భారత్ లో చెలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ ని సిస్టమ్ నుంచి తొలగించ గలిగాం అన్నారు. దేశ ఖజానా..పేద ప్రజల చేతుల్లోనే ఉండాలన్నారు.
డిజిటల్
‘భీమ్’ యాప్ ప్రత్యేకతలు
ప్రపంచంలోనే
అత్యంత పెద్ద అద్భుతంగా భీమ్ యాప్ అవతరించబోతోంది. ఆ రోజు ఎంతో
దూరంలో లేదు. అన్ని లావాదేవీలు భీమ్ యాప్ ద్వారానే జరుగుతాయి.’’
-ప్రధాని
మోదీ
డిజిటల్
లావాదేవీల దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. వినియోగదారులు తాము
కొన్న వస్తువులకు, పొందిన సేవలకు చేయాల్సిన చెల్లింపులను డిజిటల్ పద్ధతిలో
అత్యంత సరళతరం చేసే యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్
ద్వారా డబ్బు వేరొకరికి బదిలీ చేయవచ్చు. వేరొకరి నుంచి స్వీకరించవచ్చు.
సెకన్ల వ్యవధిలోనే లావాదేవీలు పూర్తవుతాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్
ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) భీమ్ పేరుతో దీన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం
భద్రతాంశాల పరిశీలనలో ఉంది. మరో రెండువారాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి
వస్తుంది. బ్యాంకు ఖాతాను ఆధార్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఈ యాప్
పని చేస్తుంది. వస్తువులు కొన్న, సేవలు పొందిన వినియోగదారులు తమ వద్ద
ఫోన్ కానీ, ఇంటర్నెట్ కనెక్షన్ కానీ లేకుండా కూడా వ్యాపారులకు డిజిటల్
డబ్బు చెల్లించవచ్చు. వ్యాపారుల స్మార్ట్‌ఫోన్లలో భీమ్ యాప్ ఉంటేచాలు.
ఆ ఫోన్‌ను బయోమెట్రిక్ రీడర్‌కు అనుసంధానిస్తారు. ఆ యాప్‌లో వినియోగదారుడు
తన ఆధార్ సంఖ్యను కొట్టవలసి ఉంటుంది. అనంతరం ఏ బ్యాంకు ద్వారా నగదు
చెల్లించాలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ పరికరంపై వేలిముద్రను
స్కాన్ చేయడం ద్వారా ఆ వినియోగదారుడే అసలు ఖాతాదారుడా కాదా అని నిర్ధారణ
అవుతుంది. అంటే వేలిముద్రే పాస్‌వర్డ్‌గా పని చేస్తుంది. ఈ యాప్‌ను ఉపయోగించుకున్నందుకు
ఎటువంటి సేవా రుసుములుండవు. వ్యాపారులు డిజిటల్ లావాదేవీలకు మళ్లడానికి
ఇది దోహదం చేయనుంది. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు
తీసుకోవాలంటే మాస్టర్‌కార్డు, వీసా వంటి సర్వీసు ప్రొవైడర్లకు రుసుములు
చెల్లించాల్సి వస్తోంది.
భీమ్ యాప్‌లోని
ప్రధాన అంశాలు
లభ్యత ఎక్కడ?: గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాండ్రాయిడ్ ఫోన్లకయితే వర్షన్ 8, అంతకన్నా ఎక్కువ వర్షన్లుకు, ఐవోఎస్ స్మార్ట్‌ఫోన్లకయితే వర్షన్ 5, అంతకన్నా ఎక్కువ వర్షన్లకు అందుబాటులో ఉంది. ఇతర ప్లాట్‌ఫాంలకు త్వరలో అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని భాషల్లో అందుబాటులోకి రావచ్చు.
యాప్ సైజ్: దాదాపు 2ఎంబీ
లావాదేవీల గరిష్ఠ పరిమితి
రోజుకు కనీసం రూ.నుంచి గరిష్ఠంగా రూ.20వేల వరకు బదిలీ చేసుకోవచ్చు. ఒక లావాదేవీపై గరిష్ఠ పరిమితి రూ.పదివేలు.
ఎలా పని చేస్తుంది?
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక తమ బ్యాకు ఖాతా వివరాలను నమోదు చేసి ఆ ఖాతాకు యీపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాలి. యాప్‌ను ఉపయోగించేవారి మొబైల్ నంబరే వారి పేమెంట్ చిరునామా అవుతుంది. యూపీఐ పిన్‌ను పొందాలంటే మెయిన్ మెనూకు వెళ్లి అందులో బ్యాంకు ఖాతాల ఆప్షన్‌లోకి వెళ్లాలి. ప్రాధాన్య బ్యాంకు ఖాతాకు యూపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం డెబిట్/ఏటీఎం కార్డులోని చివరి 6 అంకెలు, కార్డు గడువు ముగిసిపోయే తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒన్‌టైమ్ పాస్‌వర్డ్ ఫోన్‌కు వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి యూపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాలి. అప్పటి నుంచి ఈ యాప్.. డబ్బు పంపడం, స్వీకరించడం వంటి లావాదేవీలను అనుమతిస్తుంది.
ప్రస్తుతానికి ఒక బ్యాంకుఖాతాకే పరిమితం
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా పలు బ్యాంకులు భీమ్ యాప్ ద్వారా లావాదేవీలను అనుమతిస్తున్నాయి. ఇతర యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అప్లికేషన్లు, బ్యాంకు ఖాతాలతో పరస్పరం సమాచారాన్ని అందిపుచ్చుకునేలా భీమ్‌ను అభివృద్ధి చేశారు. అయితే ప్రస్తుతానికి ఏదైనా ఒక బ్యాంకు ఖాతాకే భీమ్‌ను అనుసంధానించుకోవచ్చు. యాప్‌లో బ్యాంకు ఖాతాను అనుసంధానించేటప్పుడు డీఫాల్ట్ ఖాతాను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరో బ్యాంకు ఖాతాను అనుసంధానించాలనుకుంటే మెయిన్ మెనూలోకి వెళ్లి డీఫాల్ట్ ఖాతాను మార్చుకోవాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment