న్యూ ఇయర్ వస్తోందంటే చాలు మ్యూజిక్ షోలు, సంగీత కచేరీలు. టాలీవుడ్,
బాలీవుడ్ నటులు, సెలబ్రిటీల హంగామా. న్యూ ఇయర్ అంటే పార్టీల హడావుడి.
దేశవ్యాప్తంగా వేడుకలు జరిగినా.. ముంబై, ఢిల్లీ తర్వాత వినూత్నంగా జరిగేది
హైదరాబాద్‌లోనే. అయితే ఈ ఏడాది న్యూ ఇయర్ పార్టీయింగ్ బోసిపోనుంది. పెద్ద
నోట్ల రద్దుతో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీలో ఇప్పుడు హ్యాపెనింగ్స్
లేకుండాపోయాయి.
అయితే పెద్ద
నోట్ల రద్దు ప్రభావం ఈసారి న్యూ ఇయర్ పార్టీలపై లేదంటున్నాయి సర్వేలు. 67
శాతం భారతీయులు ఈ ఏడాది టికెట్లను ఆన్‌లైన్‌లో కొంటున్నట్లు చెబుతున్నాయి.
గత ఏడాది కంటే ఈసారి ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారన
సీక్వియో కేపిటల్ సర్వే వెల్లడించింది
ఇదంతా న్యూ ఇయర్ అంటే పార్టీల హడావిడి.
దేశవ్యాప్తంగా వేడుకలు జరిగినా.. ముంబయ్, ఢిల్లీ తర్వాత వినూత్నంగా
జరిగేది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్‌లోనే. కానీ ఈ ఏడాది నోట్ల
రద్దుతో న్యూ ఇయర్ వేడుక కళ తప్పనుంది...
నోట్ల
దెబ్బతో హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీలు బోసిపోతున్నాయి. పెద్ద నోట్లు
లేవు..చిన్న నోట్ల కొరత.. దీంతో నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం చెప్పే
మూడ్‌లో ఎవరూ లేరు. గత ఏడాది అధికారికంగా 120 పెద్ద ఈవెంట్లు జరిగితే
చిన్నా చితకా ఈవెంట్లు మరో 160 నుంచి 180 జరిగాయి. అయితే ఈ ఏడాది కేవలం 80
పెద్ద ఈవెంట్లు జరుగుతుంటే.. చిన్న ఈవెంట్ల నిర్వాహకులు పత్తా లేకుండా
పోయారు.
గతంలో ఎక్కడెక్కడ పార్టీలు జరుగుతున్నాయి..
ఉన్న వాటిలో బెస్ట్ ఏది? సెలబ్రిటీలు.. ఇంటర్నేషనల్ డీజేలు ఎవరు? ఇలా
ఎన్నో అంశాలను ఆరా తీసే హైదరాబాదీలు.. ఇప్పుడు తక్కువ రేటులో ఎక్కడ పార్టీ
జరుగుతోంది!? ఆన్‌లైన్‌లో టికెట్లు ఎవరిస్తున్నారు!? అని వెతుకుతున్నారు.
కాలేజీ యువతను లక్ష్యంగా చేసుకుని అధిక శాతం డీజే పార్టీలు జరుగుతుంటే..
ఆయా కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఈవెంట్ మేనేజర్ల
సహకారంతో పార్టీలు చేస్తున్నాయి. గత ఏడాది పూనమ్ కౌర్, సన్నీ లియోన్,
సంజన వంటివాళ్లు రాగా.. ఈసారి సెలబ్రిటీ ఈవెంట్లు కనిపింటచడం లేదు.
ఇన్‌స్టాగ్రామ్, డబ్ స్మాష్ ఫేమస్ దీప్తి సునయన, వైవా జస్వంత్ ఈసారి
స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఇప్పటికే హోటళ్లు, కన్వెన్షన్,
ఫంక్షన్ హాళ్లలో వేడుకల ప్రచారం మొదలైనా.. టికెట్ల అమ్మకాల్లో వేగం
కనిపించడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
చేతిలో
డబ్బులు లేకపోవడంతో పార్టీ ప్రియుల రూటు మారింది. గతంలో రిసార్టులు,
పబ్‌లు, ఓపెన్ ఈవెంట్లలో సందడి చేసిన కుర్రకారు.. ఈసారి కలిసి చేసుకుంటే
కలదు సుఖం అంటున్నారు. ఒక పార్టీకి వెళ్లి 5000 ఖర్చు చేసే బదులు ఆ డబ్బుతో
ముగ్గురు కలిసి ఎంజాయ్ చేయవచ్చనే భావనకు వచ్చారు. అపార్టుమెంట్
సెల్లార్లలో ముగించేద్దామని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం లాంగ్
టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.
No comments:
Post a Comment