Thursday, 29 December 2016

jayalalitha

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సందేహాలున్నాయంటూ మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్స్ ఇవాళ విచారణకొచ్చాయి. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు ఆమె మృతిపై ఉన్న సందేహాలకు మరింత ఊతమిచ్చాయి. జయలలిత మృతిపై తనకు సందేహాలున్నాయని జస్టిస్ వైద్యనాథన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆయన చెప్పారు. జయలలిత అనుమానాస్పద మృతిపై సందేహాలు తొలగేందుకు ఆమె మృతదేహానికి రీపోస్ట్‌మార్టమ్ ఎందుకు చేయకూడదనే పిటిషనర్ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలా చేస్తే వాస్తవాలు బయటికొచ్చే అవకాశమున్నట్లు న్యాయస్థానం భావిస్తోంది. అయితే రీపోస్ట్‌మార్టానికి సంబంధించి కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు.

 మీడియాలో కూడా జయలలిత మృతిపై అనేక సందేహాలు వ్యక్తపరుస్తూ వార్తలొచ్చాయని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితమే శశికళ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు వేరే వారి చేతుల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కోర్టు వ్యక్తం చేసిన అనుమానాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి

No comments:

Post a Comment