Wednesday, 28 December 2016

రామ్మోహన్‌నాయుడు పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినే..

ఏపీ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అయిన టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు వచ్చే ఏడాది ఓ ఇంటివారు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆమె ఏం చదువుకుంది అనే విషయాలపై రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఆమె పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చిన్న కుమార్తె శ్రీ శ్రావ్య అని మాత్రమే అందరికీ తెలుసు. అయితే భరత నాట్యంలో ఆమె ఎక్స్‌పర్ట్ అని చాలామందికి తెలియదు. విశాఖ పట్నంలోని గాయత్రి విద్యాపరిషత్ కాలేజీలో శ్రావ్య ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చిన్నతనం నుంచి చదువులో ఆమె ముందుండేదని, ఇంజనీరింగ్‌లో కూడా మంచి మార్కులు సాధించిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
 
శ్రావ్య, రామ్మోహన్ జంటను చూసిన వారు జోడీ అదిరిందని చెబుతున్నారు. అమ్మాయికి, అబ్బాయికి అన్ని విషయాల్లోనూ బాగా సెట్ అయిందని అంటున్నారు. బండారు ఫ్యామిలీతో కింజారపు కుటుంబానికి ముందు నుంచే సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో ఎర్రన్నాయుడితో కలిసి బండారు సత్యనారాయణమూర్తి పనిచేశారు. ఇప్పుడు సత్యనారాయణ మూర్తి కుమారుడు, రామ్మోహన్‌నాయుడు మంచి మిత్రులు. ఈ నేపథ్యంలో శ్రావ్యను రామ్మోహన్ తొలి చూపులోనే ఇష్టపడ్డాని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన శక్తిగా ఉన్న కింజారపు ఎర్రన్నాయుడి అకాల మరణం తర్వాత రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. పెద్దల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంటూ తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. పార్లమెంటులో తన ప్రసంగాలతో సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. టీడీపీ యూత్ బ్రిగేడ్‌లో కీలక సభ్యుడని సీనియర్ నేతలు రామ్మోహన్ ఆటపట్టిస్తుంటారు. సంబంధాలు చూడమంటావా?.. అంటూ కలిసినప్పుడల్లా జోకులేస్తుంటారు. ఇప్పుడు టీడీపీ ఫ్యామిలీలోని ఎమ్మెల్యే కుమార్తెతోనే రామ్మోహన్‌నాయుడి వివాహం జరగనుంది.

No comments:

Post a Comment