Friday, 30 December 2016

లక్ష్మి దేవి మిమ్మల్ని మెచ్చి మీకు సంపదలు ఇవ్వాలంటే. ?

లక్ష్మి దేవి మిమ్మల్ని మెచ్చి మీకు సంపదలు ఇవ్వాలంటే. ?????
“ధనం మూలం ఇదం జగత్” అన్నారు మన పెద్దలు,అయితే లక్ష్మి దేవికి చెంచు లక్ష్మి అని కూడా పేరు ఉంది, అంటే ఆవిడా ఒక చోట స్తిరంగా ఉండదు.అందుకే ఆవిడా అనుగ్రహం పొందాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయ్,అవేమిటో ఇపుడు చూద్దాం.
లక్ష్మి గణపతిని పూజించడం:-
లక్ష్మి గణపతి అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అయితే ఎక్కడైతే అయన పూజింపబదాతాడో,అక్కడ లక్ష్మి అమ్మవారు స్థిరంగా ఉంటుంది,అంతే కాదు గణపతి పేరు కూడా లక్ష్మి గణపతి అని వచ్చింది.
తామర పువ్వులతో:-
లక్ష్మి అమ్మవారు పాలా సముద్రం నుండి తామర పువ్వుతో బైటకి వచ్చింది,అందుకే ఆవిడకి తామర పువ్వు తో ఆవిడను పూజిస్తే ఎంతో సంతోషించి మనల్ని అనుగ్రహిస్తుంది.
ఇంటిని,ఇంటి వాకిలిని శుభ్రంగా ఉంచాలి
హిందూ ధర్మం ప్రకారం గుమ్మము పైన భాగం శక్తి స్వరుపినిగ పూజిస్తే గుమ్మమ్ కింద భాగాన్ని లక్ష్మి దేవిగా పూజిస్తారు అటువంటి గుమ్మానికి మరియు ఇంటి ప్రధాన ద్వారాన్ని మనం పూజిస్తే,అమ్మవారికి మనం స్వాగతం పలికినట్టే.
సాయంత్రం వేళలో నిద్రపోవడం
సాయంత్రం నిద్రపోవడం వల్ల అమ్మవారి కోపానికి గురికావడం ఖాయం అంతే కాకుండా లక్ష్మి దేవి సోదరి ఐన జ్యేష్ట దేవి( ఎవరైతే దరిద్రాన్ని ఇస్తుందో) ఆ దేవతా మన ఇంటికి వస్తుంది,అందుకే సంధ్య వేళల్లో నిద్ర అనేది ఎప్పుడు పోరాదు.

No comments:

Post a Comment