Wednesday, 28 December 2016

ద్రవిడ్‌, లక్ష్మణ్‌లే అత్యుత్తమం

తన బౌలింగ్‌ ఎదుర్కొన్న వాళ్లలో రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లే అత్యుత్తమ బ్యాట్స్‌మెనని పాకిస్థాన్‌ కళంకిత ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ అన్నాడు. ‘‘ద్రవిడ్‌, లక్ష్మణ్‌ సాంకేతికంగా చాలా మంచి బ్యాట్స్‌మెన్‌. ఆఫ్‌స్టంప్‌ నుంచి బంతిని అలవోకగా లెగ్‌సైడ్‌కు కొట్టగలరు. వాళ్లకు బౌలింగ్‌ చేయడం పెద్ద సవాల్‌’’ అని ఆసిఫ్‌ చెప్పాడు. ‘‘విరాట్‌ కోహ్లి కూడా సాంకేతికంగా బలమైన బ్యాట్స్‌మన్‌. అతడికి బౌలింగ్‌ చేయడం బౌలర్లకు కష్టమే’’ అని అన్నాడు

No comments:

Post a Comment