దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల ప్రజల కల
ఫలించింది. సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి-నిజామాబాద్ రూట్లో రైలు
సర్వీసును రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్
ద్వారా ప్రారంభించారు. మరో రైలు సర్వీసును కరీంనగ్-లింగంపేట్-
జగిత్యాల నుంచి మోర్తాడ్ వరకు పొడగించారు. ఈ మార్గానికి మరో 25
కిలోమీటర్లు మార్గం పూర్తయితే ఐదు జిల్లాల ప్రజలకు లాభం చేకూరనుంది.
ఢిల్లీలో రైలు సర్వీసును రిమోట్ ద్వారా సురేష్ ప్రభు ప్రారంభించిన
కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ,నిజామాబాద్ ఎంపీ కవిత
పాల్గొన్నారు. దశాబ్దాల కల నెరవేరడంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం
వెల్లివిరిసింది.
No comments:
Post a Comment