Saturday, 24 December 2016

గుర్తింపు కార్డు ఉంటేనే వెంకన్న దర్శనం…. షేర్ చెయ్యండి

గుర్తింపు కార్డు ఉంటేనే వెంకన్న దర్శనం…. షేర్ చెయ్యండి..
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ గుర్తింపు కార్డును తప్పనిసరి చేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. భక్తులకు తితిదే అందిస్తున్న సేవల్లో పారదర్శకత పెంచడంతో పాటు, అక్రమాలను అడ్డుకోవడానికి ఇప్పటికే గదుల బుకింగ్‌, శ్రీవారి అర్జిత సేవలతో పాటు దర్శనం టిక్కెట్లు, అంగప్రదక్షిణం టోకెన్ల జారీ, శ్రీవారి సేవకుల నమోదు కోసం ఆధార్‌కార్డును స్వీకరిస్తున్నారు. తాజాగా ఇదే విధానాన్ని కాలినడక భక్తులకు కూడా అమలు చేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో తిరుమలకు చేరుకునే యాత్రికులకు గాలిగోపురం వద్ద, శ్రీవారిమెట్టు మార్గంలో వచ్చే వారికి 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. ఇకపై భక్తుడి ఫోటోతో పాటు గుర్తింపుకార్డు నంబరును పొందుపరిచి దర్శనం టిక్కెట్లు జారీ చేయనున్నారు. గుర్తింపు కార్డు నంబరు పొందుపరిచిన యాత్రికులకు మాత్రమే లడ్డూ టోకెన్లు, శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలవుతుందని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భక్తులను తితిదే కోరింది.
షేర్ చెయ్యండి.

No comments:

Post a Comment