పాత నోట్లు అయిన రూ.500, వెయ్యి రూపాయల చెలామణికి మరో వెసలుబాటు
కల్పించింది కేంద్రం. బ్లాక్ మనీ వెల్లడికి ప్రకటించిన ప్రధానమంత్రి గరీభ్
కళ్యాణ్ యోజన కింద ఈ చెల్లింపులు చేయొచ్చంట. ఈ పథకం కింద.. మీ దగ్గరున్న
పాత నోట్లతో పన్నులు చెల్లించుకోవచ్చని ప్రకటించింది కేంద్రం. పన్నులతోపాటు
జరిమానాలు చెల్లించటానికి కూడా అవకాశం ఇచ్చింది కేంద్రం. ( ఉదా: వెహికల్ చలానాలను పాతనోట్లతో బ్యాంకు ద్వారా చెల్లింపు )
ఈ పన్నులు బ్యాంకు ద్వారా మాత్రమే అనే కండీషన్ పెట్టింది. ఇప్పటి వరకు
మీరు బ్యాంకుల ద్వారా ఏయే పన్నులు అయితే చెల్లిస్తున్నారో.. వాటిని గరీభ్
కళ్యాణ్ యోజన స్కీమ్ కింద చెల్లించవచ్చు. పన్నులు వసూలు చేసే బ్యాంకుల్లో
మాత్రమే పాతనోట్లతో చెల్లింపులు చేసుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. ఇది
కూడా డిసెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటి
వరకు కేంద్రం చేసిన సవరణల్లో ఇదొకటి. ఇప్పటికే చాలా బ్యాంకులు ఖాతాదారులకు
ఫోన్లు చేసి.. పాతనోట్ల మీ బిల్లులు చెల్లిస్తామని ఆఫర్ ఇస్తున్నాయి. ఈ
వారం రోజుల్లో ఈ వెసలుబాటు కింద ఎంత డిపాజిట్ అవుతాయో చూడాలి.
No comments:
Post a Comment