వారానికి 150 నిమిషాల వ్యాయామం చాలు
ముందే చేయాలి
సాధారణంగా చాలామంది తమకేదైనా అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడుతుంటారు. ఉదయం పూట నడక, ఇతర వ్యాయామాలు చేసే వారు 5-7 శాతంలోపే ఉన్నారని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వచ్చిన తర్వాతే వ్యాయామానికి పలువురు ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఈ అలవాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీయకుండా హాయిగా జీవితాన్ని గడిపేయవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు.
* వారానికి 150 నిమిషాలు సాధారణ వ్యాయామం లేదంటే వారంలో 75 నిమిషాలు కాస్త ఎక్కువ శ్రమ కలిగించే వ్యాయామాలు చేయవచ్చు. యువకులైతే రెండూ చేసినా సరిపోతుంది. * 65 ఏళ్లు పైబడిన వారైతే వారంలో కనీసం రెండు రోజులపాటు 45 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. * శరీరంలో కండరాలు పుష్టిగా ఉండేందుకు వారంలో రెండు రోజులు కొంత సమయం పాటు కేటాయించాలి. ఈత, పులప్స్, డిప్స్, చిన్నచిన్న బరువులు ఎత్తడం చేయాలి. దీనివల్ల కాళ్లు, తొడలు, చేతుల కండరాలు గట్టిపడతాయి. * 30-45 నిమిషాల పాటు ఒకే చోట కూర్చోకూడదు. ప్రతి అరగంటకు ఒకసారి కుర్చీలో నుంచి లేచి 2-3 నిమిషాలు అటు ఇటు నడవాలి. ఉద్యోగులైనా ఇదే పద్ధతి పాటించాలి. * ముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండాలి. మితిమీరిన మద్యం అలవాటూ ప్రమాదకరమే. |
No comments:
Post a Comment