Wednesday, 28 December 2016

ర‌చ్చ ర‌చ్చ‌గా మారిన క్రిష్ ఖ‌బ‌డ్దార్ డైలాగ్‌

బాల‌య్య 100వ సినిమాలో డైరెక్ట‌ర్ క్రిష్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఈ సినిమా ఆడియో వేడుక‌లో క్రిష్ ప్ర‌సంగం త‌ర్వాత చివ‌ర్లో ఖ‌బ‌డ్దార్ అనే హెచ్చ‌రిక డైలాగ్ వ‌దిలారు. క్రిష్ చేసిన ఈ డైలాగ్ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద కాంట్ర‌వ‌ర్సీల‌కు దారితీసింది. సంక్రాంతి బరిలో తమ సినిమాతో పోటీ పడుతున్న ‘ఖైదీ నెంబర్‌ 150’ని ఉద్దేశించే క్రిష్‌ అలా అన్నాడని పలు ఛానళ్లు కథనాలను ప్రసారం చేశాయి.
క్రిష్ డైలాగ్స్‌పై కాంట్ర‌వ‌ర్సీ క‌థ‌నాలు మీడియాలో రావ‌డంతో మెగా ఫ్యాన్స్ సైతం ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు. ఈ వివాదం పెద్ద‌ది అయ్యే సూచ‌న‌లు క‌నిపించ‌డంతో క్రిష్ దీనిపై స్పందించాడు. తాను ఖ‌బ‌డ్దార్ అన్న ప‌దానికి కొత్త అర్థాలు వెత‌క‌వ‌ద్ద‌ని సూచించాడు.




ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వారి త‌ర‌పున తాను ఆ మాట అన్నాన‌ని… తెలుగు సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు స‌రైన గౌర‌వం ద‌క్క‌డం లేద‌నే బాధ‌తో తాను ఖ‌బ‌డ్దార్ అన్నాన‌ని ఆయ‌న తెలిపారు. ఈ డైలాగ్ తెలుగు వారిని గౌర‌వించ‌ని దేశం, ప్ర‌పంచానికే వ‌ర్తిస్తుందే త‌ప్ప వ్య‌క్తుల‌కు కాద‌ని స్ప‌ష్టం చేశాడు.
త‌న‌కు మెగా హీరోల‌తో ఉన్న అనుబంధాన్ని కూడా క్రిష్ తెలిపాడు. త‌న రెండో సినిమా బ‌న్నీతో వేదం చేశాన‌ని, నాలుగో సినిమా కంచెను వ‌రుణ్ తేజ్‌తో తీశాన‌ని..ఇక తాను సినిమాల్లోకి రాక‌ముందు నుంచే చెర్రీ త‌న‌కు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. తాను సినిమాల్లోకి వ‌చ్చేందుకు చిరంజీవి గారు స్ఫూర్తి అని ద‌య‌చేసి ఈ ఖ‌బ‌డ్దార్ డైలాగ్‌కు మెగా ఫ్యామిలీకి లింక్ పెట్టి త‌న‌కు, మెగా ఫ్యామిలీకి మ‌ధ్య కంచె నిర్మించ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశాడు.

No comments:

Post a Comment