Friday, 30 December 2016

సీఎం అఖిలేష్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన ములాయం

సమాజ్‌వాదీ(ఎస్‌పీ) పార్టీలో సంక్షోభం ముదిరిపోయింది. పార్టీ అధ్య‌క్షుడు ములాయంసింగ్ యాద‌వ్ త‌న కుమారుడు, ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం అఖిలేష్‌యాద‌వ్‌ను పార్టీ నుంచి బ‌హిష్కరించారు. అఖిలేష్‌తోపాటు రాజ్య‌స‌భ స‌భ్యుడు రాంగోపాల్‌యాద‌వ్‌ను సైతం పార్టీ నుంచి ఆరేళ్ల‌పాటు బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ములాయంసింగ్ ప్ర‌కటించారు.
‘అఖిలేష్‌ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు. సమాజ్‌వాదీ పార్టీని కాపాడటం నా బాధ్యత, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మీడియా సమావేశంలో ములాయం వెల్లడించారు. సీఎం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని తెలిపారు.
మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ టికెట్ల వ్యవహారం తండ్రీకొడుకుల మధ్య దూరాన్ని పెంచింది. సీఎం అఖిలేశ్‌ సూచించినవారికి కాకూడా తనకు నచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తూ ములాయం 325 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే తండ్రి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ అఖిలేశ్‌.. 235 మంది పేర్లతో కూడి రెబర్స్‌ జాబితాను ప్రకటించారు. అఖిలేశ్‌ తిరుగుబాటు చర్యను తీవ్రంగా పరిగణించిన ములాయం.. శుక్రవారం ఉదయం షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. నోటీసు జారీ చేసిన కొద్ది గంట‌ల్లోనే అఖిలేష్‌, రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్క‌రించిన‌ట్లు ములాయం ప్ర‌క‌ట‌న చేశారు. తండ్రే కుమారుడ్ని సస్పెండు చేయ‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయం ఎన్ని మ‌లుపులు తిరుగుతోందోన‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌తోపాటు రాజ‌కీయ నేత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

No comments:

Post a Comment