ఫ్రాన్స్ దేశానికి చెందిన
సఖినా గ్రిల్స్ అనే యువతిని కరీంనగర్‌కు చెందిన చిరంజీవి అనే యువకుడు
పెళ్లి చేసుకున్నాడు. జిల్లాలోని వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన
పరశురాములు, వీరలక్ష్మీ దంపతుల కుమారుడు చిరంజీవి ఉన్నత చదువుల కోసం
మూడేళ్ల క్రితం పారిస్ వెళ్లాడు. పారిస్‌లోని ఓ యూనివర్సిటీలో పీహెచ్‌డీ
చేస్తున్నాడు. ఈ సమయంలో చిరంజీవికి అదే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేస్తున్న
సఖినా గ్రిల్స్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ
విషయాన్ని తమ తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లారు. వీరి ఇష్టానికి పెద్దలు
గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం మధ్యాహ్నం జమ్మికుంటలోని ఓ ఫంక్షన్
హాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు
వరుడి తరఫు బంధువులే కాదు వధువు తరఫు వారు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
No comments:
Post a Comment