ప్రపంచాధినేత, అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరో తేలిపోయింది. జనవరి 20న ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేయాల్సింది ఎవరో ఎలక్టార్స్ తేల్చేశారు. సోమవారం జరిగిన ఎలక్ట్రోరల్ కాలేజీ ఎన్నికల్లో తమ విస్పష్టమైన ఓటింగ్ ద్వారా శ్వేతసౌధ 45వ పాలకుడిని ఎలక్టార్స్ ఎన్నుకున్నారు. హ్యాకింగ్ ద్వారా గెలిచారని ఆరోపణలు వచ్చినా, పాలకుడిగా పనికిరారంటూ విమర్శలెదుర్కొన్న డోనాల్డ్ ట్రంప్‌ను మెజారిటీ ఎలక్టార్స్ తమ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన హిల్లరీకే ఓటేయాలంటూ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేసిన ప్రజలకు.. రాజ్యాంగంలో పేర్కొన్నట్లు అధిక ఎలక్ట్రోరల్ కాలేజీ సీట్లు పొందిన ట్రంపే అధినేతగా ఉంటారని స్పష్టం చేశారు. నవంబర్ 9న వచ్చిన ఫలితాల్లో మొత్తం 538 సీట్లలో.. ట్రంప్‌కు 306 ఎలక్ట్రోరల్ కాలేజీ సీట్లు లభించాయి. హిల్లరీకి 232 సీట్లు వచ్చాయి.
మెజారిటీ సీట్లు సంపాదించినప్పటికీ డిసెంబర్ 19న(సోమవారం) జరిగిన ఎన్నికల్లో 270 మంది ఎలక్టార్స్ ఎవరిని ఎన్నుకుంటారో వారే ప్రెసిడెంట్‌గా జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌కు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే ఓట్లు వచ్చాయి. కేవలం ఇద్దరు రిపబ్లికన్ ఎలక్టార్స్ మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతర్జాతీయ దేశాలతో సంబంధాలు, శాంతిభద్రత, అల్లర్లు, అభ్యర్థి ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సీట్లు వచ్చిన హిల్లరీకే ఓటేయాలంటూ ఎలక్టార్స్‌కు నిరసనలు తెలిపినా, వేల కొద్ది మెయిల్స్ పంపినా ట్రంప్‌నే గెలిపించడం గమనార్హం. ట్రంప్ గెలుపును సూచిస్తూ.. అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ మన ట్రంపేనని ఉపాధ్యక్షుడిగా ఎంపికయిన మైక్ పెన్స్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను ట్రంప్ రీట్వీట్ చేశారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా తనకు అండగా నిలిచినందుకు మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ట్విటర్ వేదికగా ట్రంప్ తెలిపారు. ఈ ఎన్నికపై ఆశపెట్టుకున్న డెమొక్రటిక్ మద్దతుదారులకు ఫలితం తీవ్ర నిరాశకు గురిచేసింది. అద్భుతం జరిగి హిల్లరీ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతారని ఆశలు పెట్టుకున్న ట్రంప్ వ్యతిరేకులకు ఆశాభంగం ఎదురైంది.
No comments:
Post a Comment