థియేటర్లో సినిమా ఇలా పడటం పాపం... నిమిషాల్లో దాని ప్రింట్ చేతికొస్తుంది. అదీ కూడా హెచ్‌డీ నాణ్యతతో.. అద్భుతంగా ఉంటుంది. ఇంకా దారుణం ఎంటంటే... ఒక్కోసారి సినిమా ఇంకా థియేటర్లో పడకముందే దాని ప్రింట్ బయటకు వచ్చేస్తుంది... రూ.కోట్ల నిర్మాత డబ్బు... దర్శకుడి ప్రతిభ... హీరోల కష్టం.. డిస్టిబ్యూటర్ల ఆశలు అన్నీ ఇలా కాపీ పేస్ట్ వ్యాపారంలా సాగిపోతున్నాయి. ఇదంతా ఒక మాఫియా తరహాగా సాగుతోంది. తెలుసుకుంటే విస్తుపోవడమే మన వంతు అవుతుంది. కొత్త సినిమాల పైరసీ వ్యాపారం నవ్యాంధ్రరాజధానిలో జోరుగా సాగుతోంది. దీన్ని నిఘావర్గాలు కనిపెట్టాయి.
గుంటూరు : వారం రోజుల కిందట గుంటూరు నగరంలో పైరసీ సీడీల తయారీ కేంద్రంపై అర్బన్ ఎస్పీ త్రిపాఠికి వచ్చిన సమాచారం మేరకు విస్తృతంగా దాడులు చేశారు. ఇటీవలే విడుదలైన ధృవ, రెమో, మన్యంపులి, జయమ్మ నిశ్చయమ్మురా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, బేతాళుడు లాంటి కొత్త డీవీడీలను పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నీలిచిత్రాలు దొరికాయి. 524 కొత్త సినిమాల డీవీడీలు, 207 నీలి చిత్రాలు, 600 కొత్త సినిమాలకు సంబంధించిన హార్డు డిస్కు, 2000 కొత్త సినిమాల పేర్లుతో ముద్రించిన కవర్లు పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. కొత్త సినిమాలను నిమిషాల్లో డీవీడీల్లోకి మార్చే కంప్యూటర్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారికి కొత్త సినిమాల మాస్టర్ ప్రింట్ ఎక్కడ నుంచి వచ్చింది..? ఎలా పైరసీ చేస్తున్నారనే కోణంలో లోతుగా దర్యాప్తు చేపడితే అసలు తీగ బయటపడింది.
పైరసీ సీడీలను ఎలా చేస్తారంటే!
కొత్త సినిమాలను డీవీడీల్లో రైట్ చేసి విక్రయించే వ్యాపారానికి అలవాటుపడిన ముఠాలు సినిమా విడుదలకు నెలల ముందుగానే పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటారు.కొన్ని సందర్భాల్లో సినిమా విడుదలకు ముందుగానే పైరెటెడ్ డీవీడీలు బయటకు వచ్చిన ఘటనలు ఉన్నాయి. ఇతర దేశాల్లోని చిత్ర ప్రదర్శనను డౌన్‌లోడ్ చేసుకోటానికి ప్రయత్నిస్తుంటాయి. అలాగే రాష్ట్రంలో సినిమా విడుదలైన గంటల్లోనే సాంకేతిక పరిజ్ఞానంతో థియేటర్లలో కాపీ చేసుకోవడం చేస్తుంటాయి. ఆ విధంగా కాపీ చేసుకున్న సినిమా ప్రింట్‌ను పెన్‌డ్రైవ్ ద్వారా, డీవీడీ ద్వారా తొలి కాపీని తయారు చేసుకుంటారు.
రూ.4 పెట్టుబడి.. రూ. కోట్లలో వ్యాపారం
ఒక్కో ఖాళీ డీవీడీ రూ. 4 నుంచి రూ. 5 వరకు ఉంటుంది. వాటిని కొత్త సినిమాలు ఎక్కిస్తుంటారు. ఒక్కో డీవీడీలో మూడు సినిమాలు ఉండేలా చూస్తారు. వాటి ధర ఒకటి రూ. 30 నుంచి రూ. 40 వరకు ఉంటుంది. హెచ్‌డీ అయితే ఒక్కొ డీవీడీలో ఒక్క సినిమా ఉంటుంది. వాటి ధర రూ. 40 నుంచి రూ. 50 ఉంటుంది. కొత్త సినిమాలకు సంబంధించి పాటల విడుదల సందర్భంలోనే వాటి డీవీడీల ముఖచిత్రాలు (కవర్లు) కలర్‌లో ముద్రించి నిల్వ చేసుకుంటారు. సినిమా కాపీ రాగానే వాటిని పైరసీ చేసి ముఖచిత్రాలను పెట్టి మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. రహదారులపక్కన తోపుడుబండ్లపై అందుబాటులో ఉంచుతారు. ఒక్కో తోపుడు బండి వద్ద ఉన్న వ్యక్తికి కొందరు సీడీ దుకాణాల యజమానులు రోజుకు రూ. 500 చొప్పున నెలకు రూ. 15 వేల వరకు జీతం చెల్లిస్తున్నారంటే ఆదాయం ఎంతమేరకు ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తూ రూ. కోట్లు గడించి ఖరీదైన బంగ్లాలు కొనుగోలు చేశాడనే వాదనలు ఉన్నాయి. కొత్తపేటకు చెందిన ఓ వ్యాపారి, సంజీవనగర్‌కు చెందిన మరో వ్యక్తి, బ్రాడీపేటకు చెందిన మరో వ్యాపారి, రాజాగారితోటకు చెందిన మరో వ్యాపారి ఇలా ప్రధాన ప్రాంతాల్లో అనేకమంది వ్యాపారులు పైరసీ డీవీడీల విక్రయించడంతో రూ. కోట్లు సంపాదిస్తున్నారు.
మాస్టర్ కాపీ ఎలా.. ఎక్కడ..?
బెంగళూరు, చైన్నై వంటి నగరాల్లో తెలుగుభాషా చిత్రాలకు అంతగా ప్రాధాన్యం ఉండకపోవంతో అక్కడ పైరసీ మాస్టర్ కాపీలను తయారు చేసే వారికి సమస్యలు తక్కువగా ఉంటాయి. అక్కడ సాంకేతిక నిపుణులు ఎక్కువ ఉండటంతో తొలికాపీని అక్కడే సిద్ధం చేస్తుంటారు. అక్కడ నుంచి గుంటూరు, విజయవాడలకు కొత్త సినిమాలను పెన్‌డ్రైవ్‌లో, డీవీడీల్లో నగదు చెల్లించి రహస్యంగా తెచ్చుకుంటారు. తెచ్చుకున్న కాపీలతో గుంటూరు, విజయవాడల్లో పైరేటెడ్ డీవీడీలు చేసే ముఠాలు తమ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. కొత్త సినిమాలను నిమిషాల్లో పైరసీ చేయడంలో గుంటూరు, విజయవాడకు ప్రత్యేకమైన పేరుంది. మాస్టర్ కాపీలతో నిమిషాల్లో పదుల సంఖ్యలో పైరసీ సీడీలను చేస్తుంటారు. మాస్టర్ కాపీ రావడం ఆలస్యమైతే అంతర్జాలంలోనూ ప్రయత్నిస్తుంటారు. అలా కుదరకపోతే మారుమూల గ్రామాల్లోని సినిమా థియేటర్లలో ప్రదర్శించే వేళల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తొలి ప్రదర్శనను తమ కెమేరాలతో చిత్రీకరిస్తారు. వాటిని చిత్రం బాగా కనిపించడంతోపాటు మాటలు వినిపించేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
రాజధాని నుంచి ఇతర జిల్లాలకు..
గుంటూరు, విజయవాడల్లో పైరసీ డీవీడీలు తయారు చేసే ముఠాలు సుమారు 20కిపైగా ఉన్నట్లు నిఘా వర్గాల విచారణలో తేలింది. కంప్యూటర్ సీపీయూకు ఇరవై, 40 డీవీడీలను తయారు చేసే డీవీడీ రైటర్లను అమర్చుకుంటారు. అలా 40 డీవీడీలు అమర్చిన సీపీయులు పది నుంచి ఇరవై వరకు సిద్ధం చేసుకుంటారు. ఇలా ఒక్కసారిగా 300 నుంచి 500 డీవీడీలు తయారు చేసే విధానాన్ని సమకూర్చుకుంటారు. గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లాల్లోని ఏ పట్టణానికి, మారుమూల గ్రామానికైనా డీవీడీలు కావాలంటే రాజధాని ప్రాంతంలోని ముఠాలు సమకూర్చాల్సిందే. కేవలం ఈ మూడు జిల్లాలకే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు గుంటూరు, విజయవాడల నుంచే పైరసీ డీవీడీలు వెళ్తున్నాయి.
తనిఖీలు తర్వాత షరా మూములే!
పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఆయా దుకాణాలపై కేసులు నమోదు చేయడం కొత్త సినిమాల డీవీడీలు స్వాధీనం చేసుకోవడం, దుకాణ యజమానులను అరెస్టు చేయడం జరుగుతోంది. అంతటితో పైరేటెడ్ డీవీడీల వ్యాపారం అడ్డుకట్టపడుతుందా అంటే అది జరగని పని. పోలీసులు తనిఖీలు చేసిన కొద్ది రోజులు మాత్రం దుకాణాలను మూసివేస్తారు. కొద్ది రోజుల తర్వాత షరా మామూలే. ఇటీవల ఓ యువకుడు ఎస్పీకి వాట్సప్‌కు పైరసీ డీవీడీలు తయారు చేస్తున్నారని, విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు హడావిడిచేసి కొన్ని దుకాణాలపై దాడులు చేశారు. ఆ రెండు రోజులు

No comments:
Post a Comment