Friday, 23 December 2016

మ‌న‌డ‌బ్బు మ‌నం తీసుకుంటే స‌ర్‌ఛార్జ్‌

రోజుకో నిబంధన తెస్తూ ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురిచేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా మ‌రో రూల్ తీసుకొచ్చేందుకు త‌యారైంది. డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించే భాగంలో ఇక‌పై ప‌రిమితికి మించిన డ‌బ్బును బ్యాంక్‌నుంచి కానీ, ఏటీఎం నుంచి కాని విత్ డ్రా చేస్తే స‌ర్‌ఛార్జ్ విధించాల‌ని కేంద్రం యోచిస్తోంది. ఈ సర్ ఛార్జ్ 0.5 శాతం నుంచి 2 శాతం మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది డిసెంబ‌ర్ 30 త‌ర్వాత అమ‌లు కానున్న‌ట్లు స‌మాచారం. క‌నీస ప‌రిమితికి మించి డ‌బ్బు డ్రాచేస్తే సర్ ఛార్జ్ వ‌డ్డ‌న త‌ప్ప‌ద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.
బ్యాంకుల నుంచి రోజుకు రూ.50వేలు, ఏటీఎంల నుంచి రూ.15 వేలు క్యాష్ విత్ డ్రా చేసుకుంటే స‌ర్‌ఛార్జ్ పేరుతో వ‌డ్డ‌న విధించ‌నున్నారు.
ప్ర‌స్తుతం ఉన్న క్యాష్ విత్‌డ్రాల్ లిమిట్ డిసెంబ‌ర్ 30తో ముగుస్తుంది. ఆ త‌ర్వాత క్యాష్‌ను ఎంతైనా తీసుకోవ‌చ్చ‌ని చెప్పిన ప్ర‌భుత్వం దానికి కూడా స‌ర్‌ఛార్జ్ పేరుతో మెలిక పెట్టింది. బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ‌లు లేవు కాబ‌ట్టి  స‌ర్‌ఛార్జ్ విధిస్తే కొంత నియంత్రించొచ్చు అన్న ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్లు స‌మాచారం.నల్లధనాన్ని అదుపు చేయడంపై జస్టిస్‌ ఎం.బి.షా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటయిన సర్‌ఛార్జి విధింపును పరిశీలిస్తున్నారు.

No comments:

Post a Comment