పాతనోట్ల మార్పిడిపై ఉన్న నిబంధనల్లో కాస్త సడలింపును ఇచ్చింది కేంద్రం.
మనీ విత్ డ్రా పరిమితుల్లో మార్పులు చేసింది. ఇపుడున్న 4 వేల రూపాయల
ఎక్సేజీని 4వేల 5వందలకు పెంచింది. అలాగే బ్యాంకుల నుంచి రోజుకు రూ.10 వేలు
మాత్రమే విత్ డ్రా నిబంధనను ఉపసంహరించుకుంది. వారానికి విత్ డ్రాయల్
పరిమితిని 20వేల నుంచి 24వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ATM ల
ద్వారా డ్రా చేసుకునే వెసులుబాటును 2వేల నుంచి 2వేల 5వందల పెంచింది
కేంద్రం. అయితే ఇది సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యాకే ఉంటుందని చెప్పిది
ఆర్బీఐ.
No comments:
Post a Comment