Thursday, 29 December 2016

దుబాయ్‌లో ఈ 12 పొరపాట్లు తెలియక చేసినా.

విదేశాలకు వెళ్లేవారు ఆయాదేశాలలో పాటించవలసిన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి. అవగాహనలేకపోతే ఏం జరుగుతుందో దుబాయ్‌ జైళ్లలో ఉన్న విదేశీ ఖైదీలను అడిగితే తెలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంతవిలాసవంతమైన ప్రాంతం దుబాయ్. అక్కడి పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. ఉపాధి కోసం  విదేశాల నుంచి వచ్చేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. దీంతో దుబాయ్‌లో విదేశీయుల సంఖ్య బాగా పెరిగింది. కానీ అక్కడ అమలు చేసే నియమనిబంధనలపై సరైన  అవగాహన లేకపోవడంతో చిన్నచిన్న పొరపాట్లు చేసి జైళ్ల పాలవుతున్నారు. దుబాయ్ నివసిస్తున్న వారు ఈ 12 చిన్న విషయాలపై అవగాహన పెంచుకుంటే నేరాలకు దూరంగా ఉన్నట్టుగా భావించవచ్చు.  
 
1. డ్రగ్స్ వాడకం దుబాయ్‌లో పూర్తిగా నిషిద్ధం. డ్రగ్స్ అమ్మినా, కొన్నా నేరమే. జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే. డాక్టర్లు సూచించిన మందులను పొందడం మాత్రమే అక్కడ సాధ్యమవుతుంది.
 
2. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపని మటాషే. కేవలం బార్లలో, ఇంట్లో, కేటాయించిన ఇతర ప్రదేశాల్లో మాత్రమే తాగాలి. లేదంటే ఫలితం తీవ్రంగా ఉంటుంది.
 
3. అశ్లీలంగా దుస్తులు ధరించడం, బీచ్‌లలో పొట్టి దుస్తులు ధరించడం దుబాయ్‌లో పూర్తీగా నిషిద్ధం. మహిళలు శరీరాన్ని కనిపించకుండా దుస్తులు ధరించాలి. పురుషులు కూడా వీదులలో తిరిగేటప్పుడు శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.
 
4. వీదులలో పెద్దపెద్ద శబ్ధాలతో పాటలు పెట్టడం, డ్యాన్స్‌లు చేయడం నేరం. కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే పాటలు వినాలి, డ్యాన్స్‌లు చేయాలి. లేదంటే శిక్ష తీవ్రంగా ఉంటుంది. 
 
5. నిబంధనల గురించి తెలియని ఓ బ్రిటిష్ దంపతులు ఓ బీచ్‌లో సెక్స్‌లో పాల్గొన్నారు. ఇద్దరూ జైలు పాలయ్యారు. అంతేకాదు పబ్లిక్ ప్రదేశాల్లో ముద్దుపెట్టుకున్నా సరే నేరమే.
 
6. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా దూషణలు చేయకూడదు. తెలిసీతెలియని మాటలు ఇస్లాంను కించపరిచేలా ఉంటే నేరం చేసినట్టే. శిక్షార్హులు అవుతారు.
 
7. దుబాయ్ పెద్ద కాస్మోపాలిటన్ నగరమే. కానీ అక్కడ డ్రెసింగ్ స్టైల్ మాత్రం కట్టుబాట్లకు విరుద్ధంగా ఉండకూడదు. మహిళలు టైట్ జీన్స్, షార్ట్స్, స్కట్స్ ధరించడం నిషేదం. నిబంధనలను జవదాటితే శిక్షఅనుభవించాల్సిందే.
 
8. అనుమతి లేకుండా ఏది కనబడితే అది, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీస్తే తగిన మూల్యం చెల్లించాల్సిందే. ముఖ్యంగా మహిళల ఫోటోలు తీసేటప్పుడు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.
 
9. దుబాయ్‌లో నేరాల రేటు తక్కువగానే ఉంటుంది. కానీ జేబు దొంగతనాలు ఎక్కువగా ఉంటాయి. కాబ్బట్టి పర్స్‌ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
 
10. పెళ్లి కాకుండా అక్రమసంబంధాన్ని కలిగిఉండడం నేరం. శిక్ష ఘోరంగా ఉంటుంది. జైలు కూడు తినాల్సిందే.
 
11. ముస్లింలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పడు పబ్లిక్ ప్రదేశాల్లో తినడం, మద్యంతాగడం, ధూమపానం చేయడం నేరం. చీవింగమ్‌లాంటివి నమలడం కూడా నేరమే.
 
12. ఎడమచేతిని ఉపయోగించడం తగ్గించాలి. ఎందుకంటే.. ముస్లిం సంస్కృతిలో ఎడమచేతిని అపరిశుభ్రతకు చిహ్నంగా భావిస్తారు. కావున ఎడమ చేతితో నమస్కారం చేయడం, కరచాలనం చేయడం, భోజనం చేసేటప్పుడు ఎడమచేతిని ఉపయోగించకూడదు. భోజనం చేసేటప్పుడు ఎడమ చేతితో ఆహారపదార్థాలను ముట్టుకోవడం, అందించడం తప్పు.
 
పైన తెలిపిన 12 విషయాలలో జాగ్రత్తలు పాటిస్తే దుబాయ్‌లో జైళ్ల పాలయ్యే విదేశీయుల సంఖ్య తగ్గేఅవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment