నోట్లరద్దు తరువాత భారీ మొత్తంలో పాత, కొత్త నోట్లను
స్వాధీనపరుచుకున్నట్లు ఐటీశాఖ పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం
పాత పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 21
వరకు ఐటీశాఖ సుమారు రూ.505కోట్లు స్వాధీన పరుచుకున్నట్లు
ప్రకటించింది. ఐటీశాఖ స్వాధీనం చేసుకున్న రూ.505కోట్లలో రూ.90కోట్లకు
పైగా కొత్తనోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నోట్లరద్దు తరువాత
రూ.3,950కోట్ల లెక్కచూపని అక్రమాస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు.
లెక్కచూపని అస్తులకు సంబంధించిన 3,589మందికి నోటీసులు కూడా జారీ
చేసినట్లు అధికారులు చెప్పారు.
No comments:
Post a Comment