అమరావతి:
విజయవాడ నుంచి వారణాసి(కాశీ)కి నేరుగా ప్రత్యేక విమానం అందుబాటులోనికి
రానుంది. కేవలం రూ.2500 టిక్కెట్ ధరతో కాశీకి చేరుకునేలా ఫిబ్రవరి
17 నుంచి సర్వీసును అందుబాటులోకి తెస్తున్నారు. 180మంది ప్రయాణికులు
పట్టే భారీ విమానాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం
నుంచి హైదరాబాద్ మీదుగా ఈ సర్వీసు వారణాసి చేరుకుంటుంది. ఇప్పటివరకూ
వారణాసికి విమానంలో వెళ్లాలంటే ఇక్కడి నుంచి ఎయిర్‌ఇండియా సర్వీసులో
దిల్లీకి చేరుకుని అక్కడి నుంచి మరోటి మారాల్సి వస్తోంది. రైలు, రోడ్డు మార్గంలో
వెళ్లేందుకు 30గంటల పైనే పడుతోంది. నేరుగా విమాన సర్వీసు అందుబాటులోనికి
రావడం వల్ల మూడు నాలుగు గంటల్లోనే కాశీకి చేరుకునేందుకు వీలుంటుంది.
ప్రస్తుతం రైలులో వెళ్లాలన్నా 30గంటల పైగా సమయంతో పాటు, సెకండ్
ఏసీలో వెళ్తే రెండు వైపులకూ కలిపి రూ.5,140 అవుతోంది. అదే బస్సులో
వెళితే దీనికి రెట్టింపవుతోంది.
No comments:
Post a Comment