పురుషులకు
హెచ్చరిక! ఆహారంలో సోయా స్థాయిలు ఎక్కువైతే తండ్రయ్యే అవకాశాలకు
గండి పడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. సోయాలోని రసాయనాలు
వీర్యాన్ని దెబ్బ తీస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. స్పెయిన్‌లోని వాలెన్సియా వర్సిటీ,
బ్రిటన్‌లోని ఐవీఐ ఫెర్టిలిటీ కేంద్రం నిపుణులు సంయుక్తంగా దీన్ని నిర్వహించారు.
25 మంది పురుషులు దీనిలో పాల్గొన్నారు. దాదాపు రెండేళ్లపాటు వీరి ఆహారంలో
సోయా స్థాయిలు ఎక్కువగా ఉండేలా చూశారు. సోయా పైపొరల్లో ఉండే బిస్ఫెనాల్-ఏ
రసాయన ప్రభావాన్ని గుర్తించేందుకు దీన్ని చేపట్టారు. అయితే వూహించని
రీతిలో ఫైటోఈస్ట్రోజన్‌గా పిలిచే మరో రసాయన ప్రభావం దీనిలో వెలుగు చూసింది.
ఇది వీర్య కణాల ఉత్పత్తి వేగాన్ని తగ్గిస్తోందని, క్రోమోజోమ్‌ల నిష్పత్తిపైనా
ప్రతికూల ప్రభావం చూపిస్తోందని బయటపడింది. ఇటీవల కాలంలో మాంసానికి
ప్రత్యామ్నాయంగా సోయా ఉత్పత్తులను విరివిగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment