Friday, 23 December 2016

దత్తత గ్రామాల్లో గృహప్రవేశాలుపైలాన్, కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో పండుగ వాతావరణం నెలకొంది. వేద పండితుల మధ్య శాస్త్రోక్తంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. రెండు గ్రామాల్లో 600 డబుల్ బెడ్‌రూం ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరిగాయి. గ్రామాల్లోని ప్రజలంతా ఒకేసారి గృహప్రవేశం చేశారు. ఒక్కో ఇంట్లో ఒక్కో బ్రహ్మణుడిచే వాస్తుపూజ, పూణ్యాహవచనం, సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. సుమూహుర్తం 7.53 గంటలకు వేద మంత్రోచ్చారణ నడుమ గ్రామస్తులు గృహప్రవేశం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామాల్లో ఒకటైన నర్సన్నపేటకు చేరుకున్నారు. సీఎం చేతుల మీదుగా నర్సన్నపేట, ఎర్రవల్లి గ్రామాల్లో సామూహిక గృహప్రవేశాలు జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సన్నపేటకు చేరుకున్న సీఎంకు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నర్సన్నపేట గ్రామంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత ఎర్రవల్లికి  చేరుకుని కమ్యూనిటీ హాల్‌ను  ప్రారంభించారు సీఎం. కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.

No comments:

Post a Comment