:అమెరికాలోని
ఫ్లోరిడా నగరంలో అది ఒక స్కూల్.. కానీ అక్కడ వినిపించింది పిల్లల మాటలు
కాదు.. ఉపాధ్యాయుల పాఠాలూ కాదు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే భారీ దాడి
జరిగిపోయింది. 10 మంది విద్యార్థినులు విచక్షణారహితంగా ముగ్గురు తోటి
విద్యార్థులపై స్కూల్ ఆవరణలోనే భయంకరంగా దాడిచేశారు. దాడి చేసినవారంతా
పట్టలేని ఆవేశంతో ముగ్గురిని ఎక్కడ కొడుతున్నారో, ఎలా కొడుతున్నారో
అర్థంకాని విధంగా, వర్ణించలేని రితీలో చితకబాదారు.
ముగ్గురు బాధితుల్లో ఒకరైన తాజానా హమ్మోద్ అనే బాలిక దాడికి సంబంధించిన వీడియోని ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది. వారిపై జరిగిన దారుణ దాడి గురించి వివరించింది. 10 విద్యార్థునులు తమ చేష్టలతో మిగతావారిని వేధించేవారని వారి మాట వినని తమపై దారుణంగా దాడిచేశారని తెలిపింది. ఇది వరకు తమపై జరిగిన దాడి సీసీ ఫుటేజీలను స్కూల్ యాజమాన్యం ఇవ్వడం లేదని విద్యార్థిని తెలిపింది. నిందితులు తమపై పదేపదే దాడి చేస్తున్నా సెక్యూరిటీ గార్డులు చూసి కూడా తమను పట్టించుకోలేదని వాపోయింది. దాడి చేసిన వారి జీవితాల గురించి ఆలోచించి పోలీసులు కేసు నమోదుచేయకపోవడాన్ని ఆమె వ్యతిరేకించింది. తమకు న్యాయం జరగాలంటే వారికి తగిన శిక్ష పడాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తోంది.

No comments:
Post a Comment