Saturday, 24 December 2016

వీటితో ఆ సామర్థ్యం పెరుగుతుంది

మనం తీసుకొనే ఆహారం... మన ఆరోగ్యంతో పాటు మనసుపైనా ప్రభావం చూపుతుందని తెలిసిందే. శృంగారపరమైన జీవితాన్ని హాయిగా ఎంజాయ్‌ చేయాలంటే రోజువారీ ఆహారంలో వీటికి కూడా స్థానం కల్పించండి.
 
స్ర్టాబెర్రీ: పురుషుల్లో శృంగారపరమైన భావనలు పెంపొందించడంతో పాటు వీర్యవృద్ధికి స్రాబెర్రీ పండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఎర్రటి బెర్రీ పండ్లలో విటమిన్‌-బి, ఫోలేట్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో అధికంగా ఉండే విటమిన్‌-సి లైంగిక వాంఛలను ద్విగుణీకృతం చేయడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఈ పండు శరీరంలో రక్తప్రసరణ స్థాయిని నియంత్రణలో ఉంచి, సహజసిద్ధమైన వయాగ్రా తరహాలో పనిచేస్తుంది.
 
గుమ్మడి గింజలు: వీటిలో పుష్కలంగా ఉండే జింక్‌ సీ్త్రలలో శృంగారపరమైన భావనలను ఉద్దీపనం చేస్తాయి. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయులను పెంచుతాయి. వీటిద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఆరోగ్యకరమైన కామోద్దీపనను కలిగిస్తాయి. ఈ గింజల ద్వారా లభించే సెలీనియుం, విటమిన్‌-ఇ ధమనుల పనితీరు మెరుగుపరుస్తాయి.
 
స్వీట్‌ పొటాటో: ఆఫ్రికన్‌ దేశాల్లో గర్భధారణ చికిత్సల్లో భాగంగా స్వీట్‌ పొటాటోలను వాడటం ఆనవాయితీ. ఈసో్ట్రజన్‌ హార్మోన్‌ తక్కువగా స్రవించేవారికి దీన్ని మందుగా ఇస్తారు. వీటిలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులోకి తీసుకొస్తుంది. ఆ సమయంలో అతిగా ఉద్రేకానికి లోనైతే వచ్చే ప్రమాద తీవ్రతను ఇది తగ్గిస్తుంది.
 
దానిమ్మ: అందరూ ఎంతో ఇష్టంగా తినే దానిమ్మ పండు శృంగారానికి మంచి ప్రేరేపకంగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. టెస్టోస్టిరాన్‌ స్థాయులను పెంచడంతో పాటు సీ్త్ర, పురుషులు ఇద్దరిలోనూ లైంగికపరమైన కోరికలను పెంచే శక్తి దానిమ్మ జ్యూస్‌కు ఉంది. దానిమ్మ గింజలు శరీరంలో రక్తప్రసరణను నియంత్రిస్తాయి.
 
యాపిల్‌: ఈ పండులో ఉండే ఫినైల్‌థైలమైన్‌ (పిఈ) సంతోషంగా, ఉత్తేజితంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ప్రొస్టేట్‌ కేన్సర్‌ను అరికట్టడంలో యాపిల్స్‌లో ఉండే క్విర్‌సెటిన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

No comments:

Post a Comment