హైదరాబాద్:
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చిత్ర నిర్మాత రామ్‌చరణ్
అన్నారు. జనవరి 4న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రీ-రిలీజ్
వేడుకను నిర్వహిస్తున్నామని ప్రకటిస్తూ రామ్‌చరణ్ తన ఫేస్‌బుక్
ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.
‘అందరికీ హాయ్.. నాకు తెలిసి ఈ వీడియో నేను ఎప్పుడో చేయాల్సింది.. నేను ఏం మాట్లాడినా మీరు వినేటట్లు లేరు. మీరు ఒక్కదాని కోసమే ఎదురుచూస్తున్నట్లు నాకు అర్థమైంది. అది నాన్నగారి 150 సినిమా ‘ ఖైదీ నంబర్ 150’ ప్రీ-రిలీజ్ ఈవెంట్. మీరనుకుంటున్నట్లుగానే విజయవాడలో ఘనంగా జరగబోతోంది. జనవరి 4న ఇందిగా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మేము సెలబ్రేట్ చేయబోతున్నాం. దానికి అభిమానులందరూ రావాలి. మీ అన్నయ్య, బాస్‌ని ఇండస్ట్రీలోకి తిరిగి ఆహ్వానిద్దాం. పాత రోజుల్లో మిమల్ని ఎలా అలరించారో అలానే.. ఈ ‘ఖైదీ నంబర్ 150’తో మొదలై ఇంకా ఎన్సో సినిమాలు చేయబోతున్నారు. కాబట్టి దయచేసి జనవరి 4న అందరూ రండి, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం’ అని రామ్‌చరణ్ వీడియోలో పేర్కొన్నారు.

No comments:
Post a Comment