khaidi no 150 movie unit has released
another single song you and me. This time Devi Sri has give melodius
tunes and mesmerized everyone
సడెన్‌గా ఆడియో వేడుకని క్యాన్సిల్ చేసిన
‘ఖైదీ నెంబర్ 150’ మూవీ యూనిట్.. వరుసగా ఒక్కో పాటకు నాలుగైదు రోజుల
గ్యాప్‌తో విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే ‘అమ్మడు లెట్స్ డు కుమ్మడు’
అనే మాస్ సాంగ్‌తోపాటు ‘సుందరి’ అనే రొమాంటిక్ పాటని విడుదల చేసిన ఈ
చిత్రబృందం.. తాజాగా ‘యూ అండ్ మీ’ అనే మెలోడియస్ పాటని రిలీజ్ చేసింది.
ఈ పాట విషయానికొస్తే.. దీనికి దేవిశ్రీ
వినసొంపైన ట్యూన్స్ అందించాడు. ‘ఇకపై ఓన్లీ యూ అండ్ మీ’ అనే సాగే ఈ పాట
లిరిక్స్ కూడా అర్థవంతంగానే ఉన్నాయి. మధ్యమధ్యలో అతను అందించిన ప్రత్యేకమైన
ట్యూన్స్ ఈ పాటకి హైలైట్‌గా నిలిచాయి. గత రెండు పాటలతో పోల్చుకుంటే.. ఈ
మూడో పాటకి దేవి కాస్త డిఫరెంట్ ట్యూన్సే అందించాడు. చూస్తుంటే.. ఈ పాట
సినిమాలోనే హైలైట్‌గా నిలిచేలా కనిపిస్తోంది.
గత రెండు పాటలకు విశేష స్పందన రావడంతోపాటు
యూట్యూబ్‌లో అవి అత్యధిక వ్యూస్‌తో రికార్డ్ సృష్టించడంతో.. మూడోపాట కూడా
అదే రేంజులో సక్సెస్ అవుతుందని యూనిట్ ఆశిస్తోంది. ఈ పాట ఎలా ఉందో.. ఓసారి
విని మీ అభిప్రాయం క్రింద కామెంట్ బాక్సుల్లో వెల్లడించండి.
No comments:
Post a Comment