కొత్త ఫోన్ లు కొనుగోళు చేసేవారికి శుభవార్త. తెలంగాణ లో ఫోన్ ల ధరలు ఇకపై భారీగా తగ్గనున్నాయి.
రాష్ట్రంలో వ్యాట్ చట్ట సవరణ బిల్లును బుధవారం శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది.
ఈ బిల్లులో మొబైల్ ఫోన్లపై పన్నును భారీగా తగ్గించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ లపై పన్ను14.5 శాతం గా ఉంది. దీనిని ఇకపై భారీగా తగ్గించి 5 శాతానికి తీసుకొచ్చారు.
బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అందరూ ఫోన్ లను వినియోగించాలనే ఉద్దేశంతో ఫోన్లపై ఉన్న పన్నును 14.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు
No comments:
Post a Comment