వైకుంఠ ఏకాదశీ వ్రతం” ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం
చదవండి. ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి.
దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైషవాలయాల్లో అత్యంత వైభవంగా
నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే
వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.
ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం.
శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని
శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ
ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు.
ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం,
జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు
స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రదా ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున
ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.
ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే పారణం (భోజనం)
చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ
చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.
అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు
నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో
నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు.
ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి
రోజున లభిస్తుంది
No comments:
Post a Comment