ప్రపంచంలో వినేకొద్ది రోజుకో వింత
అన్నట్టు ఉంటుంది ఈ వార్త. భర్తకు పట్టిన బ్లూ పిచ్చి తట్టుకోలేక ఓ భార్య
విడాకులు కోరింది. అయితే విడాకులు ఇవ్వడానికి ఆ భర్త ఒప్పుకోకపోగా భార్య తన
అదృష్టమని వదలను అని అంటున్నాడు. ఇంతకీ అసలు సంగతి ఏమితంటే…
నెలకు లక్షల్లో సంపాదించే నితిన్ విశాల్
సింగ్(36) బ్లూ రంగును ఎక్కువగా ఇష్టపడతాడు. అతని భార్యను కూడా అలానే
బ్లూని ఇష్టపడి బ్రతకమని చెప్పాడు. భర్త వింత చేష్టలకు ఆశ్చర్యపోయిన ఆమె
విడాకులు కోరింది. దానికి అతను ఒప్పుకోకపోవడంతో… అతని గురించి ఆమె ఆరా
తీయడం మొదలు పెట్టింది. అప్పుడు అసలు విషయం బయట పడింది. కొద్ది కాలం కిందట
సింగ్ ఓ స్వామిని కలిశాడు. ఆయన ‘బ్లూ’ జీవిత విధానాన్ని అవలంభించాలని
సూచించడంతో సదరు టెకీ ఆయన భార్య నవీన(30)ను కూడా అలాగే జీవించాలని ఆర్డర్
వేశాడు.
సింగ్, నవీనలకు ఐదేళ్ల క్రితం వివాహం
జరిగింది. నెలకు రూ.5 లక్షలు సంపాదించే ఈ జంట డీఎస్ఆర్ లేఔట్ లో సొంత
ఫ్లాట్ ను కూడా కలిగివుంది. సాఫీగా వీళ్ళ జీవితం సాగిపోతున్న సమయంలో… తాను
స్పిరిచ్యువల్ లైఫ్ అనుభవించాలని అనుకుంటున్నట్లు భర్త సింగ్ భార్యతో
చెప్పాడు. ఆ తరవాత అతని అలవాట్లు, పద్దతులు మార్చుకుని… మొత్తం బట్టలు ఓ
అనాథ ఆశ్రమానికి ఇచ్చేసి, భార్యను సాధారణ దుస్తులు కాకుండా ‘బ్లూ’ రంగు
దుస్తులే ధరించాలని ఆదేశించారు. అధ్యాత్మిక జీవితాన్ని మొదలుపెట్టినా..
కార్యాలయానికి మాత్రం నిత్యం వెళ్తునే ఉన్నారు. తన ఇంటి మొత్తాన్ని బ్లూ
కలర్ లోకి మార్చివేశారు. ప్రతి రోజూ తెల్లవారు జామున 2.00 గంటలకు మేల్కొని
చన్నీళ్ల స్నానం చేస్తారు. భార్యను కూడా తనతో పాటే నిద్రలేచి మెడిటేషన్
చేయమని కోరతారు.
సింగ్ ను నిశితంగా గమనించిన ఆమె.. ఆయన
కలలో వచ్చిన ఓ స్వామిజీ ‘బ్లూ’ జీవితాన్ని ఆరంభించాలని ఉపదేశించినట్లు
తెలుసుకుంది. ఈ విషయంపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతని నుంచి
విడాకులు ఇప్పించాలని కోరుతున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ, సింగ్ అందుకు
నిరాకరిస్తుండటంతో పోలీసులు కేసును కోర్టు పంపే యోచనలో ఉన్నారు.
No comments:
Post a Comment