బ్యాంకుల్లో పెద్దనోట్ల డిపాజిట్లపై మొన్న ప్రకటించిన నిర్ణయంపై రిజర్వ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తగ్గింది. ఐదువేల డిపాజిట్ ప్రకటన చేసిన కొద్ది
గంటల్లోనే ప్రజల నుంచి వెల్లువెత్తిన విమర్శలకు జడిసి యూ టర్న్ తీసుకుంది.
తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై నగదు జమ చేయడానికి వెళ్లిన
కస్టమర్ల నుంచి ఎలాంటి ప్రశ్నలు లేకుండా డిపాజిట్లు స్వీకరించనున్నట్టు
ప్రకటించింది. దీంతో దఫదఫాలుగా చేతిలో ఎంత మొత్తం ఉంటే అంతా బ్యాంకుల్లో జమ
చేసే వీలు కలిగింది.
No comments:
Post a Comment