యుక్తవయసులో ఉన్న వారికే
శృంగార పరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయని, వయస్సు పెరిగే కొద్దీ శృంగార
కోరికలు తగ్గిపోతాయనే భావన చాలామందిలో ఉంటుంది. ఈ అంశంపై కొందరు మహిళలపై
సర్వే చేయగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. యవ్వనంలో కంటే 30
నుంచి 40 ప్రాయంలోనే శృంగార పరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయని సగటు మహిళలు
భావిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ విషయమై రెండు విభిన్నమైన సర్వేలు
నిర్వహించారు. ఒకటేమో టెక్సాస్ యూనివర్సిటీ వారు నిర్వహిస్తే, మరొకటేమో
ప్రముఖ విటమిన్ కంపెనీలలో ఒకటి అయిన హెల్త్‌స్పాన్ అనే కంపెనీ
నిర్వహించింది. ఈరెండు సర్వేలూ వెల్లడించిన విషయాలన్నీ దాదాపు సమానంగానే
ఉన్నాయి.
హెల్త్‌స్పాన్ కంపెనీ ఈవిషయమై
నిర్వహించిన పరిశోధనలో దాదాపు 75 శాతం మంది మహిళలు మెనోపాజ్ దశ అనేది వారి
రిలేషన్‌మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని తేలింది. నలభై సంవత్సరాలు
దాటిన తర్వాత మహిళలు మెనోపాజ్‌కి చేరువలో ఉంటారు. దీనివల్ల వారిలో
హార్మోన్లలో అసమతుల్యం ఏర్పడి ఎక్కువగా మూడ్‌స్వింగ్స్, ఆత్రుత ఏర్పడతాయి.
అందువల్ల వారికి ఆ వయసులో శృంగారంపట్ల కోరికలు కాస్త ఎక్కువగానే
కలుగుతాయని వెల్లడైంది.
ఇక టెక్సాస్
యూనివర్సిటీ 827 మంది మెనోపాజ్‌కి చేరువైన విదేశీ మహిళలపై సర్వే
నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు తమ శృంగార జీవితం గతంలో కంటే
మెనోపాజ్ తర్వాత ఇంకా బాగుందని చెప్పారు. 20 లేదా 30 ఏళ్ల ప్రాయంలో తాము
నెలలో 10 సార్లు పాల్గొనగా, 45 నుంచి 60 ఏళ్ల మధ్యకాలంలో అంతకు రెట్టింపుగా
శృంగార జీవితం గడుపుతున్నామని చెప్పారు. 34 నుంచి 38 ఏళ్ల వయసులో తాము
సెక్స్ జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించినట్టు వారు చెప్పారు.
No comments:
Post a Comment