దేశ వ్యాప్తంగా నీట్ మాదిరిగానే ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో
సీట్ల కోసం ఒకే ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం
భావిస్తోంది. దీనిపై ఇప్పటికే హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ అధికారులు
అత్యున్నతస్థాయిలో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నిర్ణయం అమలైతే అవకతవకలకు
ఆస్కారం ఉండే అవకాశం లేదని భావిస్తోంది. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో పారదర్శకత
వస్తుందంటున్నారు ఉన్నతాధికారులు. ఇంజనీరింగ్ ప్రవేశాల గురించి గతంలో
ఎన్నో ఫిర్యాదులొచ్చాయి. ఈ క్రమంలో ఓ పారదర్శకమైన విధానాన్ని తీసుకు
రావాలనే లక్ష్యంతో మంత్రిత్వశాఖ ఉందని హెచ్ఆర్డీకి చెందిన ఓ అధికారి
తెలిపారు. ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష విధానాన్ని
ప్రవేశపెట్టాలని హెచ్ఆర్డీ నిర్ణయం తీసుకున్నా… అది 2018 నుంచి అమలయ్యే
అవకాశముంది.
No comments:
Post a Comment