కొన్ని విషయాలు అంతే.. ఎప్పటికీ వివాదంగానే మిగిలిపోతాయి. వాటికి ఓ
ముగింపు అంటూ ఉండదు. దివంగత సీఎం, అన్నాడీఎంకే నేత జయలలిత మృతి కూడా ఈ
లిస్ట్‌లోకి చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె మృతిపై ఇప్పటికే అనేక
కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో భాగంగా కొత్త రూమర్ ఒకటి ప్రచారంలో
ఉంది. అది ఏంటంటే, జయలలితకు చివరి క్షణంలో కాళ్లు పనిచేయలేదని, అలా
బతకడం తనకు ఇష్టం లేదని, మెర్సీ కిల్లింగ్‌కి చాన్స్ ఇవ్వాలని ఆమె
శశికళతో అన్నట్లు మలేషియాలోని ఓ పత్రిక కథనం రాసింది.
మలేషియా, సింగపూర్‌లో తమిళులు ఎక్కువ. అక్కడ స్థానికంగా నడిచే ఓ
టాబ్లాయిడ్ ఈ కథనం ప్రచురించినట్లు సమాచారం. అయితే, ఈ కథనంలోని
నిజానిజాల సంగతి పక్కనపెడితే.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది ఈ
స్టోరీ. మొత్తమ్మీద, జయలలిత మృతిపై మరో కొత్త స్టోరీ వెలుగులోకి
రావడం విశేషం.
No comments:
Post a Comment