సౌదీఅరేబియా.. అక్కడ చేసేది మంచిపనైనా.. చెడు పనైనా.. ప్రపంచ దృష్టిని ఆకర్షించడం మాత్రం ఖచ్చితం. అత్యంత పకడ్బందిగా అక్కడ అమలు చేసే చట్టాలు, దేశ విశిష్టతలు ప్రతీది ప్రత్యేకమే. సౌదీఅరేబియాకు చెందిన 18 వాస్తవాలు తెలిస్తే నోరెళ్లబెట్టి, కనురెప్పలు పైకి ఎగరేస్తూ ఔనా..? అంటారు.
1. మంత్రాలు, చేతబడి విద్యలు సౌదీలో నిషేదం. ఇలాంటి విద్యలు ఏ రూపంలో ప్రదర్శించినా నేరంగా పరిగణిస్తారు.
2. ఒక వ్యక్తి చావుకి కారణమైన నిందితుడు చట్టాల ప్రకారం ఎదుర్కోవలసిన
శిక్షల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ‘దియ్యా’ చట్ట ప్రకారం మరణించిన
వ్యక్తి కుటుంబానికి చెందిన వారు నిందితుడిని క్షమించి, అతడి నుంచి
పరిహారాన్ని పొందేందుకు అంగీకరిస్తే నిందితుడికి కేసుల నుంచి విముక్తి
లభిస్తుంది.
3. ‘దియ్యా’ చట్టప్రకారం నిందితుడు ఒక పురుషుని మరణానికి చెల్లించే పరిహార
మొత్తంలో కేవలం సగం మాత్రమే స్త్రీ మరణానికి చెల్లించాల్సి ఉంటుంది.
4. సౌదీ వ్యక్తులు ‘దియ్యా’ చట్టం ద్వారా ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది.
భవిష్యత్తులో వేరోకరి మరణానికైనా కారణమైనప్పుడు తాను ఎంత చెల్లించడానికి
సిద్ధమవుతాడో అదే స్థాయి మొత్తాన్ని అతడు చనిపోయినప్పుడు దియ్యా పరిహారంగా
పొందే అవకాశమే ‘దియ్యా ఇన్సూరెన్స్’.
5. మహిళలు డ్రైవింగ్ చేయడం సౌదీఅరేబియాలో నిషిద్ధం. చట్టరిత్యానేరం.
6. జనాలు తిరిగే రోడ్లపై కారుని ఒకవైపు వంచుతూ రెండు చక్రాలపై కారుని
నడపడం, వేగంగా వెళుతున్న కారుపై నిలబడడం సౌదీలో ఎక్కువగా ఆడుతున్న, ఆదరణ
కలిగిన క్రీడ.
7. ఉప్పగా ఉండే సముద్రపు నీటిని అత్యధికంగా మంచినీటిగా మారుస్తున్న దేశంగా సౌదీఅరేబియా గుర్తింపుపొందింది.
8. ప్రపంచలోనే అత్యంత ఎత్తైన భవనం ‘కింగ్‌డామ్’ని సౌదీలోనే నిర్మించనున్నారు. 2018 నాటికి భవన నిర్మాణం పూర్తి కానుంది.
9. మహిళలకు ఓటు హక్కుని కల్పించిన చివరి దేశంగా సౌదీఅరేబియా గుర్తించారు. అక్కడి మహిళలు మొదటిసారిగా 21 ఆగష్టు 2015న ఓటు వేశారు.
10. దేశ రాజధాని రియాద్ ప్రపంచలోనే అతిపెద్ద ఒంటెల మార్కెట్‌గా గుర్తింపుపొదింది. అక్కడ రోజుకు కనీసం 100 ఒంటెల అమ్మకం జరుగుతుంది.
11. సౌదీలోని ‘ఘవార్ ఫీల్డ్స్’ ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ క్షేత్రంగా
గుర్తించారు. ఇప్పటివరకు 75 మిలియన్ బారెల్ ఆయిల్ ఇక్కడి నుంచి
వెలికితీశారు.
12. వైశాల్యంలో 13వ అతిపెద్ద దేశంగా సౌదీ గుర్తింపు పొందింది. దేశ భూభాగంలో 95 శాతం ఏడారే కావడం విశేషం.
13. 2012లో సుమారు 3.16 మిలియన్ల మంది హజ్‌కు వెళ్లగా కేవలం 1.7 మిలియన్ల ముస్లింలు మిగతాదేశాల నుంచి హజరయ్యారు.
14. ఒక్క నది కూడా ప్రవహించని అతిపెద్ద దేశంగా సౌదిఅరేబియాకు గుర్తింపు ఉంది.
15. సౌదీఅరేబియన్స్ రోజుకు 8 మిలియన్ అమెరికన్ డాలర్లను కేవలం సిగరెట్ల మీదే ఖర్చుచేస్తారు.
16. ఒక దేశంగా ఏర్పడిన 23 సెప్టెంబర్ 1932 నాటి నుంచి సౌదీలో రాచరికపాలన కొనసాగుతోంది. అల్ సాద్ కుటుంబం రాజకుటుంబంగా కొనసాగుతోంది.
17. జెడ్డా పరిసర ప్రాంతాలు, హిజాజ్ ప్రాంతాలలో ఒంటె పిల్లల మాంసాన్ని ఎక్కువగా తింటున్నారు.
18. భర్త అనుమతి లేకుండా భార్యలు విదేశాలకు ప్రయాణించడం నేరం. నేరానికి తగిన చట్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment