Thursday, 29 December 2016

1.. 2.. 3.. ‘కాటమరాయుడు’

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా కిషోర్‌ కుమార్‌ పార్దసాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ సినిమా కోసం వినూత్నంగా ప్రచారం చేపట్టారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ పవన్‌ పంచెకట్టుతో మాస్‌ని ఆకర్షించేలా ఉన్న ఓ ఫొటోను బుధవారం చిత్రబృందం అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు ఫొటోలు కూడా విడుదలయ్యాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయనున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివబాలాజీ, అజయ్‌,కమల్‌ కామరాజు, అలీ, రావు రమేశ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘వీరమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘కాటమరాయుడు’ని తెరకెక్కిస్తున్నారు.

No comments:

Post a Comment