Friday, 30 December 2016

డేంజర్ : 3 గంటల్లోనే కోట్ల అకౌంట్స్ హ్యాక్

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత క్యాష్ లెస్ ట్రాన్సాక్ష‌న్స్ చేయాలంటూ కేంద్రం విప‌రీతంగా ప్ర‌మోట్ చేస్తోంది. అయితే కార్డ్‌తో లావాదేవీలు జ‌ర‌ప‌డం ఎంత‌వ‌ర‌కు సుర‌క్షితం అనేదే పెద్ద ప్ర‌శ్న‌గా మిగులుతోంది. అంతేకాదు కార్డుతో లావాదేవీలు జ‌రిపితే బ్యాంక్ అకౌంట్ల‌నే హ్యాక్ చేసే కేటుగాళ్లు త‌యార‌య్యారు. ఆ త‌ర్వాత మ‌న‌కు తెలియ‌కుండానే ఖాతాలోని డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ ఆన్‌లైన్ చోరీల‌కు పాల్ప‌డుతున్నారు హ్యాక‌ర్స్‌.
తాజాగా ఓ ప్ర‌ధాన బ్యాంక్‌నుంచి ప‌లువురి ఖాతాలు హ్యాక్ చేశారు ఐదుగురు యువ‌కులు. ఢిల్లీ ప‌రిస‌రాల్లో ఉన్న గురుగ్రామ్ సాఫ్ట్‌వేర్ కంపెనీల‌కు పెట్టింది పేరు. అక్క‌డే బ‌గ్స్ బౌంటీ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఓ ఐదుగురు యువ‌కుల‌ను నియ‌మించుకుంది. ఈ ఐదుగురు ఏమి చేస్తారో తెలిస్తే నోళ్లెళ్ల బెడ‌తారు. వారి ప‌ని ఓ ప్ర‌ధాన బ్యాంకు అకౌంట్ల‌ను హ్యాక్ చేయ‌డ‌మే. ఎవ‌రైతూ బ్యాంక్ ఖాతాల‌ను ముందుగా హ్యాక్ చేస్తారో వారికి ల‌క్ష రూపాయ‌లు బ‌హుమ‌తి కూడా ప్ర‌క‌టించింది ఆ కంపెనీ. ఇక రేస్ మొద‌లైంది. ఐదుగ‌రు ఐదు ల్యాప్‌టాప్‌లు తీసుకుని ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. కేవ‌లం 3 గంట‌ల్లోనే ఓ ప్ర‌ధాన బ్యాంకుకు సంబంధించిన వివ‌రాల‌న్నిటినీ రాబ‌ట్టి వంద‌ల కోట్ల రూపాయ‌లు తారుమారు చేసేందుకు రూట్ క‌నుగొన్నారు. అంటే అకౌంట్ల‌ను హ్యాక్ చేశారు.
కంగారు ప‌డ‌కండి. బ‌గ్స్ బౌంటీ కంపెనీ నియ‌మించుకుంది నిజ‌మైన కేటుగాళ్ల‌ను కాదు. మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఎంత ప‌టిష్టంగా ఉందో ఆన్‌లైన్ సెక్యూరిటీ ఎంత సుర‌క్షితంగా ఉందో తెలిపేందుకు ఈ ఐదుగురు యువ‌కుల‌ను రిక్రూట్ చేసుకుంది. ఈ కుర్రాళ్లు కేవ‌లం 3 గంట‌ల్లోనే మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో ఉన్నఆన్‌లైన్‌ లొసుగుల‌ను బ‌య‌ట‌పెట్టారు. హ‌ర్జీత్ అనే వ్య‌క్తి ఓ ప్ర‌ధాన బ్యాంక్‌కు సంబంధించిన రౌట‌ర్‌ను హ్యాక్ చేశాడు.
బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌కు ఏదైనా లావాదేవీల‌పై ఏమైనా సందేహం క‌లిగినా అది రౌట‌ర్ ద్వారానే జ‌రుగుతాయి. ఇప్పుడు పాస్‌వ‌ర్డ్, రౌట‌ర్‌పై నియంత్ర‌ణ నా చేతుల్లో ఉంది. ఇప్పుడు బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల లావాదేవీలను నేను ఓ ఫేక్ సైట్ క్రియేట్ చేసుకుని అందులోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయొచ్చు. వారు లావాదేవీలు జ‌ర‌పాలంటే లాగిన్ ఐడీ పాస్ వ‌ర్డ్‌లు త‌ప్ప‌కుండా ఇవ్వాలి గ‌న‌క‌.. ఈ ప్రాసెస్‌లో లాగిన్ ఐడీ పాస్‌వ‌ర్డ్‌ను హ్యాక్ చేసేస్తా అని హ‌ర్జీత్ తెలిపాడు.
ఇదే ప‌ద్ధ‌తిని క్రిమిన‌ల్స్ అవ‌లంబిస్తే కొన్ని ల‌క్ష‌ల కోట్లు తారుమార‌య్యే ఆస్కారం ఉంద‌ని హ‌ర్జీత్ తెలిపాడు. త‌మ వెబ్‌సైట్ ఎంత సుర‌క్షితంగా ఉందో ప‌రీక్షించి,  అన్ని ప‌ద్ద‌తుల్లో త‌మ సైట్ల‌ను హ్యాక్‌ చేసి వాటికి ప‌రిష్కారం ఇవ్వాల‌ని చాలా కంపెనీలు ఆహ్వానం పంపుతాయ‌ని హ‌ర్జీత్ పేర్కొన్నాడు.
ఇంట్లో కూర్చొనే చాలా వెబ్‌సైట్ల‌ను హ్యాక్ చేయొచ్చు కానీ అలా చేయ‌మ‌ని,  దేశ‌భ‌ద్ర‌తే త‌మ‌కు ముఖ్య‌మ‌ని క్రిమిన‌ల్ హ్యాక‌ర్స్ నుంచి మ‌న ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట‌ప‌ర‌చ‌డ‌మే త‌మ ప‌ని అని మ‌రో కుర్రాడు జోరీ చెప్పాడు.

No comments:

Post a Comment