ప్రస్తుతం
హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్
నరసింహన్ ఇచ్చిన విందుకు ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. తన వద్దకు వచ్చిన
అతిధులను పలకరించి వారితో ఫొటోలు దిగే పనిలో రాష్ట్రపతి ఉండటంతో
ముఖ్యమంత్రులు ఇద్దరూ కొద్దిగా పక్కకు వచ్చి లోకాభిరామాయణం
మాట్లాడుకొన్నారు. 20 నిమిషాల పాటు ఇద్దరూ నిలబడే కబుర్లు చెప్పుకొన్నారు.
ముఖ్యమంత్రులు
మాట్లాడుకొంటున్నప్పుడు క్రీడాకారిణులు సానియా మీర్జా, పీవీ సింధు, కోచ్
గోపీచంద్ వారి వద్దకు వచ్చారు. ‘మీరిద్దరూ ఒకేచోట చాలా తక్కువగా ఉంటారు. మీ
ఇద్దరితో కలిసి మేం సెల్ఫీ తీసుకొంటాం’ అని సానియా కోరగానే సీఎంలిద్దరూ
నవ్వుతూ అంగీకరించారు. ఫొటో తీసేటప్పుడు నవ్వండి సార్ అని సానియా
విజ్ఞప్తి చేసినప్పుడు ఇద్దరూ గట్టిగా నవ్వేశారు.
No comments:
Post a Comment