కేంద్ర ప్రభుత్వం
ఇటీవల రద్దుచేసిన రూ.1000, రూ.500 నోట్లు కల్గివుంటే రూ.10వేలు కనీస
జరిమానా విధించే ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిన
సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ కొద్దిసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు
చేరుకోనుంది. అయితే, ఈ ఆర్డినెన్స్‌లో కీలక సవరణ చేసినట్టు తెలుస్తోంది.
రద్దయిన నోట్లు కల్గిఉంటే జైలు శిక్ష విధిస్తారనే నిబంధన తొలగించినట్టు
సమాచారం. ఈ నెల 31నుంచి ఈ ఆర్డినెన్స్ అమలులోకి రానుంది.
No comments:
Post a Comment