Friday, 23 December 2016

కారు కొనాలంటే ఆ సర్టిఫికెట్ మస్ట్The certificate must konalante car

కారు కొనుక్కోవాలనే మీ కల సాకారం కావాలంటే ఇక నుంచి అంత ఈజీకాదు. జేబులో డబ్బులుంటే సరిపోదు.. పార్కింగ్ సర్టిఫికెట్ మస్ట్ గా ఉండాలి. ఈ నిబంధన అతి త్వరలో అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది కేంద్రం. సిటీల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్, ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ తో ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ కండీషన్ తీసుకొస్తోంది కేంద్రం. నా కారు పార్కింగ్ కు స్థలం ఉన్నది అని మనమే చూపించుకోవాలి. పార్కింగ్ ప్లేస్ సర్టిఫికెట్ లేకపోతే మీ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయరు. మనం నివసించే ఇంటిలో పార్కింగ్ ప్లేస్ ఉన్నట్లు.. సంబంధిత బిల్డర్ లేదా సొసైటీ లేదా బిల్డింగ్ అప్రూవ్ చేసే కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీలోని ప్లానింగ్ డిపార్ట్ మెంట్ నుంచి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ విషయంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు.. రవాణా శాఖ మంత్రి గడ్కరీతో కూడా చర్చించారు. అతిత్వరలో మార్గదర్శకాలు రానున్నాయి. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని 60శాతం కార్లకు ఇళ్లలో పార్కింగ్ ప్లేస్ లేదు. వీళ్లందరూ ఇళ్ల ముందే పార్క్ చేస్తున్నారు. పంచాయతీల్లో అయితే 10, 12 కుటుంబాలు నివాసం ఉండేలా అపార్ట్ మెంట్ల నిర్మాణాలు చేశారు. అందుకు తగ్గట్టు పార్కింగ్ ప్లేస్ మాత్రం ఉండటం లేదు.

No comments:

Post a Comment