Saturday, 31 December 2016

అఖిలేశ్‌పై బహిష్కరణ ఎత్తివేత

సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. అఖిలేశ్‌యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌లపై బహిష్కరణను ఎత్తివేస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వీరిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ శుక్రవారం సాయంత్రం పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.
బలప్రదర్శనే కారణమా?
పార్టీ నుంచి బహిష్కరణ నేపథ్యంలో శనివారం ఉదయం అఖిలేశ్‌ తన నివాసంలో అనుచరులతో సమావేశం ఏర్పాటుచేయగా 229 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. హాజరైన వారి సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా 229 మంది వచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అఖిలేశ్‌ పార్టీలో తన సత్తా నిరూపించుకోవడానికి ఈరోజు సాయంత్రం కూడా అనుచరులతో మరోసారి భేటీ కావాలనుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం అనుచరులతో కిక్కిరిసి ఉన్నాయి. ప్రముఖులతో వరస సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నుంచి మళ్లీ బహిష్కరణ ఎత్తివేత కబురు వచ్చింది.

No comments:

Post a Comment