ఫేస్‌బుక్..
ఇప్పుడీ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎఫ్‌బీలో ఎకౌంట్
లేదంటే ఆశ్చర్యంగా చూసే వారు కూడా ఎందరో. ప్రజల జీవితాలతో ఫేస్‌బుక్ అంతగా
పెనవేసుకుపోయింది మరి. అయితే ఫేస్‌బుక్‌లో లైకులు, పోస్టింగులతో మనుషుల
మానసిక రుగ్మతలను కూడా తెలుసుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.
బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం
తేటతెల్లమైంది. ‘‘పేస్‌బుక్ ఓ ప్రముఖ సామాజిక మాధ్యమం. అధ్యయనం కోసం మాతో
చాలా సమాచారాన్ని పంచుకుంది. ఒత్తిడి, మనోవైకల్యం కోసం నిర్వహించిన అధ్యయనం
కోసం అది ఎంతగానో ఉపకరించింది’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్
బెకీ ఇంక్‌స్టర్ పేర్కొన్నారు. మానసిక రుగ్మతలను తెలుసుకునేందుకు
ఫేస్‌బుక్ ఎంతగానో ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. ఫేస్‌బుక్ ఖాతాదారుల
ఆఫ్‌లైన్ ప్రవర్తన వారి పోస్టుల్లో వెల్లడవుతోందని అమెరికాలోని
స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్‌కు చెందిన మైఖెల్ కోసిన్స్కి
పేర్కొన్నారు.
ఖాతాదారుల పోస్టింగులు, వారు ఉపయోగించే భాష, స్టేటస్ అప్‌డేట్స్,
షేర్లు, లైకులు తదితరాలు యూజర్ల గురించి బోల్డంత సమాచారాన్ని అందించినట్టు
అధ్యయనకారులు తెలిపారు. వాటిని విశ్లేషించగా మానసిక రుగ్మత లక్షణాలు
చాలామందిలో కనిపించినట్టు తేలిందన్నారు. వారు అప్‌లోడ్ చేసే ఫొటోలు కూడా
చాలా సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. సామాజికంగా ఒంటరి అయినవారు డిప్రెషన్,
ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నట్టు తమ అధ్యయనంలో తేలినట్టు అధ్యయనకారులు
వివరించారు. కాబట్టి తల్లిదండ్రులు అటువంటి వారిని గురించి వారిలో మార్ప
తెచ్చేందుకు ప్రయత్నించాలని ఇంక్‌స్టర్ సూచించారు. ఫేస్‌బుక్ ప్రపంచంలోనే
అతి పెద్ద ఫొటో షేరింగ్ వెబ్‌సైట్. ఇందులో రోజుకు 350 మిలియన్ ఫొటోలు
అప్‌లోడ్ అవుతున్నాయి.
No comments:
Post a Comment