ప్రస్తుతం సెన్సార్ టాక్
అనేది కూడా పబ్లిసిటీ వ్యవహారంగానే మారిపోయింది. తమ సినిమా చూసి సెన్సార్
సభ్యులు బాగుందన్నారని ప్రచారం చేసుకుంటూ పబ్లిసిటీ షురూ చేస్తారు సినిమా
జనాలు. తాజాగా సంక్రాంతికి విడుదల కానున్న ‘ఖైదీ నెంబర్ 150’ సెన్సార్
టాక్ అంటూ ఓ రిపోర్ట్ బయటకి వచ్చింది. ఈ రిపోర్టును మెగా అభిమానులు
సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నారు.
ఆ
వార్తల ప్రకారం ఈ సినిమా చూడడానికి ఎప్పుడూ లేనంతగా మొత్తం 18 మంది
సెన్సార్ సభ్యులూ హాజరయ్యారట. సినిమా అయిపోయిన తర్వాత మొత్తం అందరూ లేచి
నిలబడి చప్పట్లతో అభినందించారట. మెగాస్టార్ డ్యాన్స్‌లకు, యాక్టింగ్‌కు
అందరూ ఫిదా అయ్యారట. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో ‘యూ/ఏ’
సర్టిఫికెట్ ఇచ్చారట. అలాగే సినిమా రన్ టైమ్ 147 నిమిషాలు ఉందట.
No comments:
Post a Comment