Friday, 30 December 2016

త్వరలో జబర్దస్త్ షో నిలిపివేత

దక్షిణాదిలో తెలుగు చానల్స్ లో వచ్చిన షో లలో అత్యంత ఆదరణ కలిగిన షో జబర్దస్త్... ఈ షో... రియాల్టీ షో... గేమ్, డ్యాన్స్ షో లకు దక్కని పాపులర్ జబర్దస్త్ కు దక్కింది. కాగా ఈ షోలో కామెడీ వెకిలీగా ఉంటుందని.. ఆడవారిని పలు వృత్తుల వారిని కించపరిచే విధంగా ఉంటుందని ఇప్పటికే ఈ షో పై పలు వివాదాలు ఉన్నాయి.. కొంత మంది జబర్దస్త్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. కాగా ఈ షో పై పోలీసులు కేసుని కేంద్ర ప్రసారల శాఖకి బదిలీ చేశారట.. వారు ఈ షో ప్రసారాన్ని నిలిపి వెయ్యాలనే నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది... దీంతో ఈ షో నిర్మాత మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ వారు డిసెంబర్ వరకూ ప్రసారం చేసి అనంతరం నిలిపివేయ్యాలని భావిస్తున్నారట. కాగా జబర్దస్త్ షో అభిమానులకు ఇది నిరాశను కలిగించే వార్త... అనుకోవచ్చు.

No comments:

Post a Comment