విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలలోని దేవి మూర్తులు కొందరు మహాలక్ష్మీ,
రాజ్యలక్ష్మీ మొదలైన పేర్లు కలిగి ఉండటమే సాధారణం. అయితే కేవలం లక్ష్మీదేవి
పేరుతోనే ప్రసిద్ధమైన ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మీ
ఆలయం ఒక్కటే.ముంబాయి నగరంలో ఉన్న మహాలక్ష్మీ ఆలయం కూడా ప్రసిద్ధమైనదే కాని
ఎందుకనో అది ఆ నగరవాసులకే తప్ప బయట వారికి అంతగా తెలియదనే చెప్పవచ్చు.
కాగా, జమ్ము దగ్గర ఉన్న వైష్ణోదేవి ఆలయంలో, లక్ష్మీదేవితో పాటు సరస్వతి,
కాళిమూర్తులు కూడా ఉంటాయి. మద్రాసులోని అష్టలక్ష్మీ ఆలయం ఇటీవలది.
No comments:
Post a Comment