Friday 30 December 2016

కేసీఆర్‌తో నా విందు.. పాయసం.. కొంగ కథే!


  • ప్రణబ్‌ విందుకు మమ్మల్ని ఆహ్వానించరా?
  • గవర్నర్‌ తీరు దుర్మార్గం: రేవంత్
హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌తో తన విందు అంటే పాయసం, కొంగ కథ అవుతుంద ని టీడీఎల్పీ నేత రేవంతరెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్‌ నన్ను విం దుకు పిలిచినా.. విందుకు ఆయన మా ఇంటికి వచ్చినా అదే పరిస్థితి ఉంటుంది’’ అన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘విపక్షనేతల్లో ఒకరైన మీ ఇంటికి సీఎం కేసీఆర్‌ వస్తే ఎలాంటి విందు ఇస్తారు?’’ అని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం ఇచ్చిన విందుకు విపక్ష నేతలను ఆహ్వానించకపోవటాన్ని రేవంతరెడ్డి తప్పుబట్టారు. దీనిపై గతంలోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన నరసింహన్‌ను రాష్ట్ర గవర్నర్‌గా నియమించే వీల్లేకున్నా నరసింహన్‌ కొనసాగుతున్నారన్నారు.

No comments:

Post a Comment